Heat Wave: నేడు, రేపు వడగాలులు.. ఆ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ..

|

Jun 19, 2023 | 6:00 AM

మాడు పగిలే ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) మరో షాకింగ్ న్యూస్ అందించింది. సోమవారం, మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని,

Heat Wave: నేడు, రేపు వడగాలులు.. ఆ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ..
Heat Wave
Follow us on

Heat Wave: మాడు పగిలే ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) మరో షాకింగ్ న్యూస్ అందించింది. సోమవారం, మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఎండలతోపాటు వేడి తీవ్రంగానే ఉంటుందని హెచ్చరించింది. అలాగే వేడిగాలులు బలంగా వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇక నేడు ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను చేరే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ‘ఆరెంజ్‌’ అలర్ట్‌ జారీ చేసింది.

సోమవారం ఉష్ణోగ్రతల అంచనా: 41-44 డిగ్రీల సెల్సియస్‌..

మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌, జగిత్యాల, నల్గొండ, ఆదిలాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్‌, హనుమకొండ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ పెరిగే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

మంగళవారం ఉష్ణోగ్రతల అంచనా: 40-43 డిగ్రీల సెల్సియస్‌..

నల్గొండ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ పెరిగే ఛాన్స్ ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..