AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వరుస ఐటీ దాడులతో బీఆర్ఎస్‌లో హీట్‌.. విచారణకు రావాలంటూ ఎమ్మెల్యేలకు నోటీసులు..

వరుస ఐటీ దాడులతో బీఆర్ఎస్‌లో హీట్‌ పుడుతోంది. విచారణకు రావాలని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లకు ఐటీ నోటీసులు ఇవ్వడం కాక రేపుతోంది. ఇంతకీ.. ఐటీ నోటీసులు ఇచ్చిందెవరికి?.. ఐటీ దాడులపై బీఆర్ఎస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది?

Telangana: వరుస ఐటీ దాడులతో బీఆర్ఎస్‌లో హీట్‌.. విచారణకు రావాలంటూ ఎమ్మెల్యేలకు నోటీసులు..
It Raids
Shiva Prajapati
|

Updated on: Jun 18, 2023 | 9:32 PM

Share

వరుస ఐటీ దాడులతో బీఆర్ఎస్‌లో హీట్‌ పుడుతోంది. విచారణకు రావాలని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లకు ఐటీ నోటీసులు ఇవ్వడం కాక రేపుతోంది. ఇంతకీ.. ఐటీ నోటీసులు ఇచ్చిందెవరికి?.. ఐటీ దాడులపై బీఆర్ఎస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది?

విచారణకు నోటీసులు..

గత మూడు, నాలుగు రోజులుగా తెలంగాణలో ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్‌రెడ్డి, మర్రిజనార్ధన్‌రెడ్డి.. ఇళ్లు, కార్యాలయాలపై దాడులు.. వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు కాకరేపాయి. సుమారు 84 గంటలపాటు పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ ముమ్మర తనిఖీలు చేసింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్స్, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ ఆధారంగా పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్ ఫతేమైదాన్‌‌‌‌లోని ఐటీ ఆఫీస్‌‌‌‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. శేఖర్‌రెడ్డితోపాటు జనార్దన్‌‌‌‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురికి సంబంధించిన కంపెనీలు, ఆఫీసులు, ఇండ్లు సహా మొత్తం 63 ప్రాంతాల్లో ఐటీ మూడ్రోజుల పాటు సోదాలు జరిపింది.

బ్యాంక్ లాకర్స్‌‌‌‌లో బంగారు ఆభరణాలు..

కొత్తపేట గ్రీన్‌‌‌‌హిల్స్‌‌‌‌ కాలనీలోని శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇల్లు, ఆఫీసులు.. జూబ్లీహిల్స్‌‌‌‌లోని మర్రి జనార్దన్‌‌‌‌ రెడ్డి ఇల్లు, ఆఫీసులు, జేసీ బ్రదర్స్ బ్రాంచీల్లో తనిఖీలు చేసింది. ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు, వాళ్ల కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేసింది. సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ పరిశీలించారు. లాకర్స్‌‌‌‌లోని డాక్యుమెంట్స్‌‌‌‌, ఐటీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బ్యాంక్ లాకర్స్‌‌‌‌లో బంగారు ఆభరణాలు గుర్తించి.. వాటి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దాడులు..

ఇక.. ఐటీ అధికారుల సోదాలపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌రెడ్డి రియాక్ట్‌ అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. విదేశాల్లో ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. గత 25 ఏళ్లుగా రియల్ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సోదాల్లో ఐటీ అధికారులకు సహకరించానని చెప్పారు. తనకు నోటీసులు ఇచ్చారని, 20న విచారణకు రమ్మన్నారని వెల్లడించారు ఎమ్మెల్యే శేఖర్‌‌‌‌రెడ్డి. మొత్తంగా… అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వరుస ఐటీ దాడులు బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. మరి.. 20వ తేదీన ముగ్గురి నేతల విచారణ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!