AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లవ్ మ్యారేజ్‌కి ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఒక్కసారైనా ఈ గుడికి వెళ్లాల్సిందే.!

ప్రేమ.. దేశంలో ఇప్పటికీ ఇదొక నచ్చని కాన్సెప్ట్. కులాంతర వివాహాలను అటుంచితే.. ప్రేమ వివాహాలకు కూడా నై.. నై.. అనేస్తారు పెద్దలు. ఎక్కువమంది తల్లిదండ్రులు పరువు ప్రతిష్టల కోసం ఏకంగా కుటుంబాన్నే చంపేస్తున్న సందర్భాలు కూడా మీరే చూసి ఉంటారు. కానీ మీరెప్పుడైనా ప్రేమికుల కోసం ప్రత్యేక గుడి ఉందని విన్నారా.? మేము చెప్పేది నిజమే.

Telangana: లవ్ మ్యారేజ్‌కి ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఒక్కసారైనా ఈ గుడికి వెళ్లాల్సిందే.!
Timmapur Temple
Ravi Kiran
|

Updated on: Oct 31, 2023 | 1:17 PM

Share

కరీంనగర్, అక్టోబర్ 31: ప్రేమ.. దేశంలో ఇప్పటికీ ఇదొక నచ్చని కాన్సెప్ట్. కులాంతర వివాహాలను అటుంచితే.. ప్రేమ వివాహాలకు కూడా నై.. నై.. అనేస్తారు పెద్దలు. ఎక్కువమంది తల్లిదండ్రులు పరువు ప్రతిష్టల కోసం ఏకంగా కుటుంబాన్నే చంపేస్తున్న సందర్భాలు కూడా మీరే చూసి ఉంటారు. కానీ మీరెప్పుడైనా ప్రేమికుల కోసం ప్రత్యేక గుడి ఉందని విన్నారా.? అవునండీ మేము చెప్పేది నిజమే. అది సాయిబాబా లేదా వేంకటేశ్వర స్వామి కాదండీ.. ఉగ్రనరసింహ స్వామి ఆలయం. ఇక ఈ గుడి ఉన్నది మరెక్కడో కాదు.. మన తెలంగాణలో ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో ఉన్న తాపాల నరసింహస్వామి ఆలయంలో గత 15 సంవత్సరాలుగా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తద్వారా ఈ ఆలయం ప్రేమికులకు నిలయంగా మారింది. ప్రతీ నెలా 25 నుంచి 30 ప్రేమ పెళ్లిళ్లు ఇక్కడ జరుగుతుండగా.. కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రేమ జంటలు వచ్చి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడంతో ఆ గుడికి స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు ఈ గుడిలో ప్రేమ వివాహాలకు రూ. 200 రుసుము వసూలు చేయగా.. ఇప్పుడు అది రూ. 5 వేలకు పెరిగింది.

ఇప్పటివరకు ఈ గుడికి 4000 ప్రేమ పెళ్లిళ్లు జరిగాయట. అసలు ఎందుకు ప్రేమ వివాహాలకు ఈ గుడి ఫేమస్ అయిందో తెలియదు గానీ.. అక్కడున్న స్థానికులు మాత్రం కోరిన కోరికలు తీర్చే నరసింహస్వామి.. తమకు అండగా నిలుస్తారని భావించి ప్రేమికులు ఈ గుడిలో పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారట. 1989లో స్వయంభూగా నరసింహస్వామి ఈ ఆలయంలో వెలిశారు. ఇక ఇక్కడ కేవలం చట్టబద్దమైన ప్రేమ పెళ్లిళ్లను మాత్రం నిర్వహిస్తారట. చట్టబద్దంగా 18 ఏళ్లు నిండిన మేజర్లకు మాత్రమే పెళ్లి జరిపిస్తారట ఆలయ నిర్వాహకులు. అలాగే పెళ్లయిన జంటలకు కూడా మ్యారేజ్ ధృవీకరణ పత్రాలను సైతం అందిస్తారట. ప్రతీ నెలా స్వాతి నక్షత్రం రోజున నరసింహస్వామికి వివాహం జరపుతారు. ఆ రోజున ప్రేమ పెళ్లి చేసుకోవడానికి.. కరీంనగర్ జిల్లా, చుట్టుప్రక్కల జిల్లాలకు చెందిన ప్రేమికులు వస్తుంటారు. ఇలా ఉగ్ర నరసింహస్వామి ప్రేమికులకు ఇష్టదైవంగా మారిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి