AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్‌ ట్విస్ట్‌కు ఖంగుతిన్న సీపీఎం.. ఆ ఒక్క సీటు చుట్టూ తిరుగుతున్న పొత్తుల వ్యవహారం

సీపీఎం, కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత నెలకొంది. ఇన్నాళ్లు పొత్తుల పై దోబూచులాట నడిచింది. ఇపుడు వైరా సీటు పై కాంగ్రెస్ ఇచ్చిన ట్విస్ట్ కు సీపీఎంను గందర గోళంలో పడేసింది. భద్రాచలం, పాలేరు మీద ఆశలు పెట్టుకున్న సీపీఎంకు, మొదటే షాక్ ఇచ్చింది. కానీ తమకు బలమున్న ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వక పోతే పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. కేంద్ర స్థాయిలో చర్చలు, రాష్ట్ర స్థాయిలో చర్చల్లో..

Telangana: కాంగ్రెస్‌ ట్విస్ట్‌కు ఖంగుతిన్న సీపీఎం.. ఆ ఒక్క సీటు చుట్టూ తిరుగుతున్న పొత్తుల వ్యవహారం
Khammam Politics
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 31, 2023 | 1:51 PM

Share

కాంగ్రెస్, సీపీఎం పొత్తుపై సందిగ్దత నెలకొంది.. పొత్తులో ఖమ్మం జిల్లా కీలకంగా మారింది, జిల్లాలో ఒక్క సీటు ఇవ్వక పోతే.. పొత్తులు ఉండవని తేల్చి చెప్పింది. రెండు రోజుల్లో తేల్చాలని డెడ్ లైన్ పెట్టింది. ఈ నేపథ్యంలో వైరా సీటు చుట్టూనే ఇపుడు పొత్తుల వ్యవహారం తిరుగుతోంది. వైరా ఇస్తేనే పొత్తు ఉంటుందని సీపీఎం తేల్చిచెబుతుంటే.. మరోవైపు వైరాలో కాంగ్రెస్ పోటీ చేయడానికి సిద్దం అవుతోంది. ఈ పరిణామాల బట్టి, వైరా సీటు పై కాంగ్రెస్ ఇచ్చిన ట్విస్ట్‌కు సీపీఎం గందరగోళంలో పడేసింది. దీంతో పొత్తు ఉంటుందా.? పొత్తకు బ్రేక్‌ పడినట్లా.? అన్ని చర్చ తెరపైకి వచ్చింది.

సీపీఎం, కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత నెలకొంది. ఇన్నాళ్లు పొత్తుల పై దోబూచులాట నడిచింది. ఇపుడు వైరా సీటు పై కాంగ్రెస్ ఇచ్చిన ట్విస్ట్ కు సీపీఎంను గందర గోళంలో పడేసింది. భద్రాచలం, పాలేరు మీద ఆశలు పెట్టుకున్న సీపీఎంకు, మొదటే షాక్ ఇచ్చింది. కానీ తమకు బలమున్న ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వక పోతే పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. కేంద్ర స్థాయిలో చర్చలు, రాష్ట్ర స్థాయిలో చర్చల్లో.. జిల్లాలో వైరా సీటు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టినట్లు సీపీఎం నేతలు చెబుతున్నారు. వైరా సీటు ఖరారు అయ్యిందని, తమ అభ్యర్థిని పోటీకి సిద్దం చేస్తున్న సమయంలో.. కాంగ్రెస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మిర్యాల గూడతో పాటు హైదరాబాద్‌లో ఒక సీటు ఇస్తామని ప్రతిపాదన పెట్టడం, వైరా సీటు ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పడంతో సీపీఎం నేతలు ఖంగు తిన్నారు.

భద్రాచలం సిట్టింగ్ స్థానం వదులు కోమని, తన అభ్యర్థి పోడెం వీరయ్యను ప్రకటించారు. రెండవ ఆప్షన్ పాలేరులో ఆశలు పెట్టుకున్న సీపీఎం పార్టీకి ఆఖరి నిమిషం లో షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ తన అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రకటించింది. ఈ రెండు సీట్లు చేజారి పోవడంతో.. పొత్తులపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని, తమకు బలమున్న ఖమ్మం జిల్లాలో ఒక్క సీటైనా ఖచ్చితంగా ఇవ్వాలని సీపీఎం పట్టు పట్టింది. వైరా సీటు ఇస్తామని ప్రతిపాదన పెట్టడంతో సీపీఎం అంగీకరించింది. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు, వీటిలో వైరా సీటు కూడా ఉంది.

కచ్చితంగా తమకు వైరా అయినా ఇస్తారని.. పోటీకి రెడీ అయ్యింది. రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం, సీపీఎం అనివార్యంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో వైరాలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు .పొత్తులో ఈ సీటు ఇస్తారనే ప్రచారం అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున టికెట్ కోసం ముగ్గురు ఆశావాహులు మధ్య గట్టి పోటీ నెలకొంది. పొంగులేటి తరపున బానోత్ విజయా బాయి, భట్టి తరపున రాందాస్ నాయక్, రేణుకా చౌదరి తరపున రామ్మూర్తి నాయక్‌ల మధ్య పోటీ నెలకొంది.

ముగ్గురు నేతలు తమ వారికి టికెట్ ఇప్పించుకోవాలనీ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే సీటు కాబట్టి.. పొత్తులో సీపీఎంకు వైరా సీటు ఇవ్వొద్దని, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. పొంగులేటి వర్గం మాత్రం తమకే టికెట్ ఖరారు అయ్యిందనీ, తమ అభ్యర్థి విజయా బాయి అని ప్రచార రథాలను సిద్దం చేసి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఖమ్మం జిల్లాలో సీపీఎంకు కాంగ్రెస్ సీట్లు ఇచ్చే పరిస్థితి, కానీ ఆలోచన లేదని, తమ దారి తాము చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, సీపీఎం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సీపీఎం పెట్టిన డెడ్ లైన్ లోపు వైరా సీటు ఖరారు ఇవ్వక పోతే.. పొత్తు లేనట్టేనని తేటతెల్లమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..