AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అర్థరాత్రి వైన్ షాపును టార్గెట్ చేసిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్..!

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అర్ధరాత్రి వేళ ఓ వైన్ షాపులో దొంగలు హల్‌చల్ చేశారు. మండల పరిధిలోని కనుకుల గ్రామంలో ఉన్న ‘నాగ వైన్ షాప్’ లక్ష్యంగా చేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు..

Watch: అర్థరాత్రి వైన్ షాపును టార్గెట్ చేసిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్..!
Wine Shop Robbery
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 27, 2026 | 5:25 PM

Share

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అర్ధరాత్రి వేళ ఓ వైన్ షాపులో దొంగలు హల్‌చల్ చేశారు. మండల పరిధిలోని కనుకుల గ్రామంలో ఉన్న ‘నాగ వైన్ షాప్’ లక్ష్యంగా చేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో దొంగలు వైన్ షాప్ వద్దకు చేరుకున్నారు. ఎవరూ లేని సమయం చూసి షాప్ షట్టర్ తాళాలను పగలగొట్టారు. లోపలికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌లో ఉన్న రూ. 20,000 నగదును చేజిక్కించుకున్నారు. కేవలం డబ్బుతోనే సరిపెట్టుకోకుండా.. షాపులో ఉన్న 12 బీర్ బాటిళ్లు, రెండు ఫుల్ లిక్కర్ బాటిళ్లను కూడా ఎత్తుకెళ్లారు.

అయితే, షాపులో దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని దొంగలు గమనించారు. తమ ముఖాలు రికార్డు కాకుండా ఉండేందుకు, ఒక దొంగ తన ముఖం ఎవరికీ కనబడకుండా క్లాత్‌తో పూర్తిగా ప్యాక్ చేసుకున్నాడు. ఈ తెలివైన వేషధారణతోనే లోపల చోరీకి పాల్పడ్డాడు. ఉదయం షాప్ తాళాలు పగిలి ఉండటం చూసిన యజమాని దిగ్భ్రాంతికి గురయ్యాడు. లోపల పరిశీలించగా నగదు, మద్యం మాయమైనట్లు గుర్తించి వెంటనే సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి
ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి
కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు..అద్భుతమైన స్కీమ్‌..!
కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు..అద్భుతమైన స్కీమ్‌..!
సీసీ కెమెరాకు దొంగ ‘మాస్క్’తో షాక్..!
సీసీ కెమెరాకు దొంగ ‘మాస్క్’తో షాక్..!
ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు
ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు
అత్యాశతో చివరికి వినాశనమే.. బంగారు జింక కథ చెప్పే జీవిత సత్యం ఇదే
అత్యాశతో చివరికి వినాశనమే.. బంగారు జింక కథ చెప్పే జీవిత సత్యం ఇదే
అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!
అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!
కీర దోసకాయ వీరికి విషంతో సమానం!
కీర దోసకాయ వీరికి విషంతో సమానం!
దేవాలయాల్లోని పవిత్ర జలాశయాల్లో స్నానం ఎందుకు చేయాలి? ఈ రహస్యం..
దేవాలయాల్లోని పవిత్ర జలాశయాల్లో స్నానం ఎందుకు చేయాలి? ఈ రహస్యం..
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!