AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Water: హైద్రాబాద్‌లో వాటర్ ప్రాబ్లం లేదు.. బెంగుళూర్‌తో పోలిక లేదన్న వాటర్ బోర్డ్

హైదరాబాద్ మహానగర నీటి సమస్యలపై సమీక్ష నిర్వహించింది వాటర్ బోర్డ్. గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని, డిమాండ్‌కు సరిపడాత వాటర్ ను సప్లై చేస్తామన్నారు మున్సిపల్ శాఖ అధికారులు. ఇక డొమెస్టిక్ కంటే బేవరేజ్ నుంచి ఆదాయం ఎక్కువగా ఉందని వాటికి సరఫరా ఆపేది లేదని తేల్చి చెప్పారు. బెంగళూరు తరహా సమస్య హైదరాబాద్‌కు రాదని రాబోదని స్పష్టం చేశారు వాటర్ బోర్డు అధికారులు.

Hyderabad Water: హైద్రాబాద్‌లో వాటర్ ప్రాబ్లం లేదు.. బెంగుళూర్‌తో పోలిక లేదన్న వాటర్ బోర్డ్
Hyderabad Water Crisis
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Apr 08, 2024 | 8:26 PM

Share

హైదరాబాద్ మహానగర నీటి సమస్యలపై సమీక్ష నిర్వహించింది వాటర్ బోర్డ్. గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని, డిమాండ్‌కు సరిపడాత వాటర్ ను సప్లై చేస్తామన్నారు మున్సిపల్ శాఖ అధికారులు. ఇక డొమెస్టిక్ కంటే బేవరేజ్ నుంచి ఆదాయం ఎక్కువగా ఉందని వాటికి సరఫరా ఆపేది లేదని తేల్చి చెప్పారు. బెంగళూరు తరహా సమస్య హైదరాబాద్‌కు రాదని రాబోదని స్పష్టం చేశారు వాటర్ బోర్డు అధికారులు.

కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, కృష్ణా 1,2, 3, గోదావరి ఫేజ్ -1 నుంచి నీటి సరఫరా జరుగుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కోర్ సిటీ GHMC 1098 MLD, ORR ఏరియాల్లో 270MLD, మిషన్ భగీరథ 150 MLD సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12శాతం నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్యపై 1700 ప్రాంతాలు, 37వేల ఇండ్లలో సర్వే చేయించిన వాటర్ బోర్డు, డిమాండ్‌కు కారణం గ్రౌండ్ వాటర్ తగ్గడమే అని తేల్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వస్తాయనే ఇంకుడుగుంతలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 37 మందికి నోటీసులు కూడా జీహెచ్ఎంసీ నుంచి ఇచ్చినట్లు వివరించారు.

నగరంలో వాటర్ సమస్య ఉన్నప్పటికీ గత ఏడాది మార్చి నెలలో 21వేల మంది కస్టమర్స్ వాటర్ ట్యాంకర్లు అడిగితే, ఇప్పుడు 31వేల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలిపారు. మహానగర వ్యాప్తంగా 78 పిల్లింగ్ స్టేషన్లు ఉంటే 700 ట్యాంకర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇక, రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక నెల రోజుల్లో 1,50,000 ట్రిప్పులు నీళ్లను అందిస్తుంటే, మేలో రెండు లక్షల 50 వేలు, జూన్ జూలైలో మూడు లక్షల వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని వాటర్ బోర్డు అంచనా వేస్తోంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే ఇప్పుడున్న ట్యాంకర్లతో పాటు మరొక 300 ట్యాంకర్లను సైతం పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 300 మంది డ్రైవర్లను సైతం తీసుకున్నామని, రెండు వందల మంది వరకు రిపోర్ట్ కూడా చేశారని వివరించారు.

ఇక డొమెస్టిక్‌తో పాటు బేవరేజ్‌కు సైతం నీటిని సరఫరా చేస్తున్నామని బేవరేజ్ కంపెనీలు వాటర్ బోర్డ్‌కు ఎంతో ముఖ్యమైనదని ఎలాంటి పరిస్థితులు వచ్చిన బేవరేజ్ కు వాటర్ ను ఆపే అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్. డొమెస్టిక్ కంటే బేవరేజ్ నుంచే దాదాపు కేవలం 40 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అన్నారు. అయితే నగరానికి సరిపడేంత నీటి లభ్యత ఉన్నప్పటికీ వాటిని ప్రజలకు చేర్చేందుకు కావలసిన ట్యాంకర్లు ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని, వాటన్నిటిని వచ్చే వారం పది రోజుల్లోనే సెట్ రైట్ చేస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అన్ని వస్తువులు కల్పిస్తామని అన్నారు దానికిషోర్.

ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్‌లో 2వేల MLD వాటర్ ను సప్లై చేస్తున్నామని భవిష్యత్తులో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్నారు. సోషల్ బిల్డప్ చేయడమే కాకుండా… ఎమర్జెన్సీ పంపింకు సైతం ఏర్పాటు చేశామని జల మండలి అధికారులు తెలిపారు. నగర ప్రజలకు బెంగళూరు తరహా ఇబ్బందులు రావని రాబోవని పేర్కొన్నారు. కానీ అధికారుల ఏర్పాట్లు ఒకవైపు, గ్రౌండ్ లెవెల్ లో డిమాండ్ మరోవైపు చూస్తుంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో నీటి కటకట తప్పే విధంగా లేదు అన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం ధీమాతో ఉన్నారు. చూడాలి మరీ రాబోయే రెండు నెలల కాలాన్ని అధికారులు ఎలా హ్యాండిల్ చేస్తారో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…