Hyderabad Metro: మెట్రో యూజర్లకు బిగ్ రిలీఫ్.. గుడ్ న్యూస్ చెప్పిన ఎండీ..
ఇందులో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ పథకాలను పొడగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయమై హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్...

హైదరాబాద్ మెట్రో అందిస్తున్న పలు రాయితీలు మార్చి 31వ తేదీ ముగిసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు మెట్రో అధికారులు శుభవార్త తెలిపారు. పలు రకాల రాయితీలను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ఇందులో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ పథకాలను పొడగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయమై హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్‌విఎస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యవంతమైన, సరసమైన ప్రయాణాన్ని అందించేందుకు హైదరాబాద్ మెట్రో కట్టుబడి ఉందన్నారు.
ఈ ఆఫర్లను పొడగించడం ద్వారా మెట్రో సేవలను మరింత ఎక్కువ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక హైదరాబాద్ మెట్రో కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకునే వారికి ఈ స్కీమ్ ద్వారా రివార్డులను పొందొచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో సగటున ప్రతీ రోజూ 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా వేసవిలో ఎండను తట్టుకునేందుకు ప్రయాణికులు మెట్రోను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..
