Telangana Election: ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి దూసుకెళ్తున్న కొత్త లీడర్స్.. తొలిసారిగా ఎన్నికల బరిలో ఎంట్రీ
ఎన్నికలొస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఈసారి లెక్క అంత ఈజీగా లేదు. తెలంగాణ దంగల్ హోరాహోరీగా సాగుతోంది. హామీల్లో.. ప్రచారంలో ఎవరికి వారు తగ్గేదే లే! అన్నట్టుగా దూసుకెళ్లున్నారు. హీటెక్కిస్తోన్న ఎలక్షన్ ఫ్రేమ్‌లో కొత్త లీడర్స్ తళుక్కుమంటున్నారు. పోటీ చేసే ఫస్ట్ టైమే అయినా దిగ్గజాలను ఢీకొట్టేలా దూసుకెళ్తున్నారు.

తెలంగాణ దంగల్ ప్రచార పర్వం వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు ఎలక్షన్ ఫ్రేమ్.. న్యూ ఫేస్ జనతా అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంటోంది. న్యూ లుక్ అదిరింది. చాలా మంది తొలిసారిగా ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చాలా మంది కొత్త వాళ్లలో ఓ కామన్ పాయింట్..!
ఎన్నికలొస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఈసారి లెక్క అంత ఈజీగా లేదు. తెలంగాణ దంగల్ హోరాహోరీగా సాగుతోంది. హామీల్లో.. ప్రచారంలో ఎవరికి వారు తగ్గేదే లే! అన్నట్టుగా దూసుకెళ్లున్నారు. హీటెక్కిస్తోన్న ఎలక్షన్ ఫ్రేమ్‌లో కొత్త లీడర్స్ తళుక్కుమంటున్నారు. పోటీ చేసే ఫస్ట్ టైమే అయినా దిగ్గజాలను ఢీకొట్టేలా దూసుకెళ్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి లాస్య నందిత.. కాంగ్రెస్ నుంచి వెన్నెల తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగతున్నారు. లాస్య నందిత దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు. ఇక వెన్నెల ప్రజా యుద్ధనౌక గద్దర్ బిడ్డ. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి.. ఈసారి నాగార్జున సాగర్ నుంచి పోటీలో ఉన్నారు. అటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్ కోరుట్ల నుంచి బరిలోకి దిగారు.
నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రాజేష్ రెడ్డి. ఇటీవల బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు. మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న రోహిత్.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనయుడు. మహబూబ్‌నగర్‌లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తెలంగాణ దంగల్‌లో హాట్‌గా మారిన ములుగులో జడ్పీ చైర్‌పర్సన్ జ్యోతి .. సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కను ఢీకొడుతున్నారు. ఇక గతంలో బీఆర్‌ఎస్ నుంచి జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన శ్రావణి, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ నిలిచారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వొడితెల రాజేశ్వరరావు మనవడు ప్రణవ్ హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పాలకుర్తిలో ఎన్నారై ఝాన్సీ రెడ్డి కోడలు యశశ్విని రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తలపడుతున్నారు. గద్వాల జడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్న సరితా తిరుపతయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు.
మాదాపూర్ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరి ఏకంగా శేరిలింగంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో అమీతుమీ తేల్చుకుంటున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన నాగరాజు.. వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఏఐసీసీ నేత పవన్ కేరా సతీమణి కోట నీలిమా సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఢీకొడుతున్నారు. ఇలా ఫస్ట్ టైమ్ లీడర్స్ లిస్ట్ చాలానే ఉంది. ఒక్క చాన్స్ అంటూ జనంలోకి దూసుకెళ్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




