రెప్ప పాటులో జీవితం తలకిందులు అవుతుంది. ఒకొక్కసారి సకాలంలో స్పందిస్తే ఆ మనిషి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే ఇందుకు కావాల్సింది కష్ట కాలంలో వేగంగా ఆలోచించే తీరు.. స్పందించి సాయం చేసే గుణం.. అలా ఓ ప్రయాణీకుడు ప్రాణాలను కాపాడిన బస్సు కండక్టర్, డ్రైవర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. బస్సులో హటాత్తుగా వచ్చిన గుండె నొప్పితో విలవిలాడుతున్న స్టూడెంట్ కు వైద్య సాయం సకాలంలో అందించి ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్, కండక్టర్ ను తెలంగాణా ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. వివరాల్లోకి వెళ్తే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా డిపోకి చెందిన కండక్టర్ జి.గంగాధర్, డ్రైవర్ బి.గంగాధర్ లు ఈ నెల 9వ తేదీన బైంసా నుంచి నిర్మల్ కి బస్సు వెళ్తున్న బస్సులో విధులను నిర్వహిస్తున్నారు. ఈ బస్సు దిలావర్‌పూర్ వద్దకు చేరుకుంది. అప్పుడు హటాత్తుగా 12 ఏళ్ల విద్యార్థి కిరణ్ గుండె నొప్పితో కుప్ప కూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ గంగాధర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సుని రోడ్డు పక్కకు ఆపించి బి.గంగాధర్‌తో కలిసి ప్రాథమిక చికిత్స అందించాడు. వెంటనే కిరణ్ ను ఆ బస్సులోనే సమీపంలో ఉన్న నర్సాపూర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. సకాలంలో కిరణ్ ను ఆస్పత్రికి తీసుకుని వెళ్ళడం వలన ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు.
బస్సులో గుండె నొప్పితో బాధపడుతున్న విద్యార్థికి సకాలంలో వైద్య సాయం అందించి ఉదారత చాటుకున్న తమ సిబ్బందిని #TGSRTC యాజమాన్యం అభినందించింది.
బైంసా డిపోనకు చెందిన కండక్టర్ జి.గంగాధర్, అద్దె బస్సు డ్రైవర్ బి.గంగాధర్‌ను హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో… pic.twitter.com/2fYaGz4VA9
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) September 11, 2024
సమయస్పూర్తితో వ్యవహరించి స్టూడెంట్ ప్రాణాలను కాపాడిన డ్రైవర్, కండక్టర్ లను హైదరాబాద్ బస్ భవన్ లో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా సన్మానించారు. నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. అనుకోకుండా ఆపద ఎదురైతే సమయ స్పూర్తితో వ్యవహరిస్తూ తాము ఉన్నామని ప్రయాణీకులకు భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..