AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 20 కోట్ల వ్యూస్ ని దక్కించుకున్న వీడియో.. చిన్నారి గాత్రంలోని ఆర్ద్రతకు నెటిజన్లు ఫిదా

గత కొన్ని రోజులుగా ఏ రీల్స్‌కు కూడా దక్కని వ్యూస్ ఈ వీడియోకు దక్కాయి. ఈ అమ్మాయి రీల్‌ని ఇప్పటివరకు 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ వీడియో నిజంగా చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే ఇందులో 3 ఏళ్ల ఏంజెలికా నీరో.. అమాయకత్వానికి.. చిన్నారి ప్రతిభకి మిలియన్ల మంది ప్రజలు ఫిదా అయ్యారు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.

Viral Video: 20 కోట్ల వ్యూస్ ని దక్కించుకున్న వీడియో.. చిన్నారి గాత్రంలోని ఆర్ద్రతకు నెటిజన్లు ఫిదా
AngelneroImage Credit source: Instagram/@emilio.piano
Surya Kala
|

Updated on: Sep 12, 2024 | 11:47 AM

Share

3 ఏళ్ల బాలిక పాడుతున్న వీడియో ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఆ బాలిక ‘టైటానిక్’ చిత్రంలోని ప్రసిద్ధ పాట మై హార్ట్ విల్ గో ఆన్‌ను పియానో ఆర్టిస్ట్‌తో కలిసి హమ్ చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో నెటిజన్లను చాలా ఆకట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఏ రీల్స్‌కు కూడా దక్కని వ్యూస్ ఈ వీడియోకు దక్కాయి. ఈ అమ్మాయి రీల్‌ని ఇప్పటివరకు 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ వీడియో నిజంగా చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే ఇందులో 3 ఏళ్ల ఏంజెలికా నీరో.. అమాయకత్వానికి.. చిన్నారి ప్రతిభకి మిలియన్ల మంది ప్రజలు ఫిదా అయ్యారు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ‘టైటానిక్‌’ సినిమాలోని ‘మై హార్ట్‌ విల్‌ గో ఆన్‌’ అనే ఐకానిక్‌ సాంగ్‌ని ఆ అమ్మాయి పాడిన తీరు జనాలకు చాలా ఎమోషనల్‌గా, హార్ట్‌ టచింగ్‌గా మారింది.

పియానో కళాకారుడు ఎమిల్ రీనెర్ట్‌తో ఈ అందమైన క్షణం వీధిలో ఉన్న వ్యక్తుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ రీల్‌కు సంబంధించి వ్యక్తుల నుంచి అపూర్వమైన స్పందనలు కనిపించాయి. ఈ వీడియో చాలా శక్తివంతమైనది. ప్రజలు దీన్ని మళ్లీ మళ్లీ లూప్‌లో చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Emil Reinert (@emilio.piano)

@emilio.piano Instagram హ్యాండిల్‌లో షేర్ చేసిన పియానో కళాకారుడు ఇఒక కామెంట్ ని కూడా జత చేశాడు. ఈ అమ్మాయి నన్ను టైటానిక్ పాటను ప్లే చేయమని కోరింది. ఈ క్షణం చాలా అద్భుతంగా.. మనోహరంగా ఉందని కామెంట్ జత చేశాడు. ఈ వీడియోపై ఒక వ్యక్తీ స్పందిస్తూ తాను 1997లో టైటానిక్ చూసినప్పటి కంటే ఎక్కువగా ఏడుస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమ్మాయి పాట నేరుగా హృదయాన్ని తాకిందని మరొకరు చెప్పారు. తన హృదయాన్ని దొంగిలించిన అమేజింగ్ ఏంజెలికా.. అంటూ ఒక వినియోగ దారుడు కామెంట్ చేశారు.

ఏంజెలికా నీరో ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పరిచయం ఉన్న ముఖమే.. చిన్నారి పాడే వీడియోలు చాలా పాపులర్. ఈ వైరల్ మూమెంట్‌తో ఏంజెలిలా క్యూట్ గర్ల్ మాత్రమే కాదు, అసాధారణమైన ప్రతిభావంతురాలిని కూడా అని మరోసారి నిరూపించుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..