Telangana Video: ఇంకా ఒక్క అడుగు దూరమే… త్వరలో నెరవేరనున్న ఐదు దశాబ్దాల డ్రీమ్..
ఓరుగల్లు ప్రజల ఐదు దశాబ్దాల డ్రీమ్.. వేలాదిమంది నిరుద్యోగుల ఎదురుచూపులు నెరవేరబోతున్నాయి.. అక్కడి ప్రజల పోరాట ఫలితం పట్టాలు ఎక్కడానికి ఇంకా ఒక్క అడుగు దూరం మాత్రమే మిగిలి ఉంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చక చకా జరిగిపోతుంది. నీళ్లు.. నిధులు.. నియామకాలు.. కాజీపేటకు డివిజన్ హోదా, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం...

ఓరుగల్లు ప్రజల ఐదు దశాబ్దాల డ్రీమ్.. వేలాదిమంది నిరుద్యోగుల ఎదురుచూపులు నెరవేరబోతున్నాయి.. అక్కడి ప్రజల పోరాట ఫలితం పట్టాలు ఎక్కడానికి ఇంకా ఒక్క అడుగు దూరం మాత్రమే మిగిలి ఉంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చక చకా జరిగిపోతుంది. నీళ్లు.. నిధులు.. నియామకాలు.. కాజీపేటకు డివిజన్ హోదా, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన ఉక్కు సంకల్పం ఇది.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వేలాది మంది నిరుద్యోగుల డ్రీమ్..ఎట్టకేలకు ఆ కల కార్యరూపం దాల్చబోతుంది.. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కోచ్ లు పట్టాలు ఎక్కడానికి టైం దగ్గర పడింది.. కల నెరవేరబోతున్న వేళ అక్కడ సంబరాలు అంబరాన్నంటున్నాయి.
కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమం ఇప్పటిది కాదు.. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్ ను డివిజన్ కేంద్రంగా అప్ గ్రేడ్ చేయాలి.. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని దాదాపు ఐదు దశాబ్దాల నుండి రగులుతున్న నిరంతర పోరాటం ఇది. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమమే నాడు తెలంగాణ రాష్ట్రసాధన పోరాటానికి ఆయుపట్టుగా నిలిచింది. వేలాదిమంది నిరుద్యోగులను ఉద్యమానికి ఉసి గొలిపింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని ప్రధాన అంశంగా పొందు పరిచింది.
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని అంతా భావించారు.. కానీ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఆ కళ నెరవేరలేదు… ఉద్యమాలు ఆగడం లేదు.. ఈ నేపథ్యంలో 2023 జూలై 8వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ గా అప్ గ్రేడ్ చేశారు. 165 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాజీపేట జంక్షన్ పక్కనే అయోధ్యపురం వద్ద ప్రస్తుతం రైల్వే వ్యాగన్ మ్యాని ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి.
కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడిన జనం కళ్లలో ఆనందం కనిపిస్తుంది.. ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్న నేపథ్యంలో స్థానికులంతా ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేసిన ఇక్కడి ప్రజలు ఆ కల నెరవేరుతున్న వేళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యపురం వద్ద జరుగుతున్న రైల్వే మ్యాని ఫ్యక్షరింగ్ నిర్మాణ పనులు దాదాపుగా 80 శాతం పూర్తి అయ్యాయి. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మందికి ఉపాధి లభిస్తుంది.. ఎలాంటి పరిశ్రమలు లేని వరంగల్ కు ఇది అతిపెద్ద వరంగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
అయితే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పై రైల్వే ఉద్యోగుల జేఏసీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ, కాజీపేట జంక్షన్ కు డివిజన్ హోదా ఇచ్చేంతవరకు తమ పోరాటాలు ఆగవని అంటున్నారు.
వీడియో చూడండి:
Reviewed the progress of Kazipet Rail Coach Factory (RMU) in Telangana, with Union Minister @kishanreddybjp Ji. pic.twitter.com/sXmmk2XsnK
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 19, 2025




