AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anvita Reddy: సంకల్పం ముందు తలవంచిన శిఖరం.. గైడ్ లేకుండానే ‘డెనాలి’ని జయించిన భువనగిరి బిడ్డ

సాధారణంగా పర్వతారోహణ అంటే పురుషులే ఎక్కువగా కనిపించే రంగం. అయితే ఓ యువతి ఆ అభిప్రాయాన్ని చెరిపేశారు. పర్వతం ఎత్తు ఎంతైనా కావొచ్చు.. సంకల్పం దానికంటే ఎత్తుగా ఉంటే శిఖరం కూడా తలవంచాల్సిందేనని నిరూపించింది. భువనగిరి గడ్డపై పుట్టిన ఓ యువతి.. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన శిఖరాల్లో ఒకటైన డెనాలీని జయించి మరోసారి తెలంగాణ జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది.

Anvita Reddy: సంకల్పం ముందు తలవంచిన శిఖరం.. గైడ్ లేకుండానే ‘డెనాలి’ని జయించిన భువనగిరి బిడ్డ
Anvita Reddy Denali Climb
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 21, 2026 | 10:07 AM

Share

ఎత్తైన పర్వతాలు చూస్తేనే చాలామంది వెనక్కి తగ్గుతారు. కానీ భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన అనితారెడ్డి మాత్రం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన శిఖరాల్లో ఒకటైన డెనాలి (6,190 మీటర్లు)ను అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన ఆమె, ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుని తెలంగాణ మహిళల సత్తాను ప్రపంచానికి చాటారు. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్‌ను జయించిన తర్వాత ఆమె లక్ష్యం మరింత పెద్దదైంది. ప్రపంచంలోని ఏడు ఖండాల అత్యున్నత శిఖరాలను అధిరోహించే “సెవెన్ సమిట్స్” లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

భువనగిరి నుంచి డెనాలి వరకు..

అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో ఉన్న డెనాలి పర్వతం అధిరోహణ పర్వతారోహకులకు అత్యంత క్లిష్టమైన సవాలుగా భావిస్తారు. తీవ్ర చలి, వేగవంతమైన గాలులు, మంచు తుఫాన్లు, ఆక్సిజన్ కొరత.. ప్రతి అడుగూ ప్రాణాలతో పోరాటమే. అలాంటి శిఖరాన్ని అధిరోహించేందుకు అనితారెడ్డి నెలల తరబడి కఠిన శిక్షణ తీసుకున్నారు. ఈ సాహసయాత్రను ఆమె ఎటువంటి గైడ్ల సహాయం లేకుండా, అర్జెంటీనాకు చెందిన మరో పర్వతారోహకురాలు ‘రెనాటో’తో కలిసి పూర్తి చేసింది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా అవసరమయ్యే ఈ యాత్రలో ఆమె విజయవంతమవడం విశేషం. డెనాలి విజయంతో ఆ లక్ష్యంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.

మర్చిపోలేని ఫాదర్స్ డే కానుక..

అన్వితారెడ్డి సాధించిన ఈ ఘనత ఆమె కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. ఆదివారం ఫాదర్స్ డే కావడంతో, తన కుమార్తె సాధించిన ఈ విజయం తనకు ఎంతో గర్వకారణమని, ఇది తనకు అందిన అత్యుత్తమ కానుక అని ఆమె తండ్రి మధుసూదనరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తల్లి చంద్రకళతో పాటు కుటుంబ సభ్యులు ఆమె ధైర్యసాహసాలను అభినందిస్తున్నారు.

సెవెన్ సమిట్స్” లక్ష్యానికి మరో అడుగు..

డెనాలి శిఖరంపై భారత జెండాను ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉంది. ఈ విజయాన్ని నా కుటుంబం, గురువులు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నాను” అని అన్వితారెడ్డి తన సంతోషాన్ని పంచుకున్నారు. సెవెన్ సమ్మిట్స్ లక్ష్యంలో భాగంగా, ఇక మిగిలి ఉన్న చివరి ఏడవ శిఖరాన్ని కూడా అతి త్వరలో అధిరోహించి, ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో భారత జెండాను మరింత ఎత్తులో ఎగురవేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

లక్ష్యంపై నమ్మకం, కష్టంపై విశ్వాసం ఉంటే ప్రపంచ శిఖరాలూ అందుబాటులోకి వస్తాయని అనితారెడ్డి మరోసారి నిరూపించారు. అన్వితారెడ్డి పట్టుదల మరియు ధైర్యం నేటి యువతకు, ముఖ్యంగా క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె తన చివరి లక్ష్యాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుందాం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us