AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది.. యంగ్ వికెట్ కీపర్లకు దినేష్ కార్తీక్ వార్నింగ్

MS Dhoni : ఎంఎస్ ధోనీ వికెట్ కీపింగ్ స్టైల్‌ను కాపీ చేయొద్దని యువ కీపర్లకు దినేష్ కార్తీక్ హెచ్చరించాడు. ధోనీ టెక్నిక్ ప్రత్యేకమని, బేసిక్స్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. వికెట్ కీపింగ్ రహస్యాలు, ధోనీ-కార్తీక్ రికార్డుల పోలిక ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

MS Dhoni : ధోనీ  స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది.. యంగ్ వికెట్ కీపర్లకు  దినేష్ కార్తీక్ వార్నింగ్
Ms Dhoni
Rakesh
|

Updated on: Jun 21, 2026 | 9:01 AM

Share

MS Dhoni : భారత క్రికెట్ జట్టులో సుదీర్ఘ కాలం పాటు వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలందించిన దినేష్ కార్తీక్.. ప్రస్తుతం లండన్ స్పిరిట్ జట్టుకు కోచ్‌గా, ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్ స్కై స్పోర్ట్స్ కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కవరేజ్‌లో భాగంగా కార్తీక్ వికెట్ కీపింగ్ సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నాడు. ఇదే సమయంలో ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విజయవంతమైన కీపర్‌గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుతూ యువ ఆటగాళ్లకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశాడు.

వికెట్ కీపింగ్‌లో ఉండే గోల్డెన్ రూల్స్ ఇవే

ఒక వికెట్ కీపర్‌కు ఉండాల్సిన ప్రాథమిక సూత్రాల గురించి దినేష్ కార్తీక్ చాలా వివరంగా మాట్లాడాడు. కీపింగ్ అనేది సరైన నిలబడే స్టైల్ తోనే ప్రారంభమవుతుందని చెప్పాడు. కీపర్ ఎప్పుడూ చాలా కంఫర్టబుల్‌గా ఉండాలని, పాదాలను భుజాల వెడల్పుతో సమానంగా ఉంచాలని సూచించాడు. బంతిని పూర్తిగా గమనిస్తూ, చేతులను సరైన పొజిషన్‌లో ఉంచుకుని డెలివరీ కోసం ఎదురుచూడాలన్నాడు. బంతి గనుక వికెట్లకు దూరంగా వెళ్తున్నప్పుడు, కీపర్ తల కూడా బంతితో పాటే కదలాలని, దీనివల్ల బాడీ బ్యాలెన్స్ తప్పకుండా క్లీన్ క్యాచ్‌లు అందుకోవచ్చని డీకే వివరించాడు. బంతిని పట్టుకునేటప్పుడు అరచేతులు ఎప్పుడూ బంతి వైపే ఫేస్ చేయాలనేది కార్తీక్ ఇచ్చిన లక్కీ టిప్.

ధోనీ ఒక అద్భుతం.. ఆయన టెక్నిక్ వేరు

మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ టెక్నిక్ ప్రపంచంలోని మిగిలిన కీపర్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ నియమావళి ప్రకారం కీపర్ బంతిని తన గ్లోవ్స్‌లోకి రానివ్వాలి.. బంతి చేతుల్లో పడినప్పుడు ఎలాంటి శబ్దం రాకూడదు. కానీ ధోనీ దీనికి పూర్తిగా రివర్స్ స్టైల్ ఫాలో అవుతుంటాడు. బంతి తన వైపు వచ్చేటప్పుడు చేతులను వెనక్కి లాగకుండా, నేరుగా బంతి వైపే చేతులను తీసుకెళ్లి ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్లలో కలెక్ట్ చేస్తాడు. ధోనీకి ఉన్న సహజసిద్ధమైన కీపింగ్ నైపుణ్యం, అద్భుతమైన ఐ-హ్యాండ్ కోఆర్డినేషన్ వల్లే అది సాధ్యమైందని కార్తీక్ కొనియాడాడు.

ధోనీని కాపీ కొట్టడం ప్రమాదకరం

ధోనీ స్టైల్ చూడటానికి చాలా ఈజీగా, స్టైలిష్‌గా అనిపించినప్పటికీ.. దాన్ని బ్లైండ్‌గా కాపీ కొట్టడం ప్రమాదకరమని కార్తీక్ స్పష్టం చేశాడు. సైద్ధాంతికంగా అది చాలా కష్టమైన టెక్నిక్ అని, ధోనీలా చేయడానికి ప్రయత్నించిన చాలా మంది కీపర్లు బంతిని చేతుల్లో నుంచి వదిలేసి క్యాచ్‌లు డ్రాప్ చేశారని గుర్తు చేశాడు. ధోనీ ఒక ప్రత్యేకమైన ఆటగాడని, ఆయన టెక్నిక్‌ను మ్యాచ్ చేయడం అందరి వల్ల కాదని, కాబట్టి యంగ్ కీపర్స్ ఎవరూ కూడా ధోనీని కాపీ కొట్టే ప్రయత్నం చేయకుండా.. తమ బేసిక్స్ పైనే శ్రద్ధ పెట్టాలని గట్టిగా కోరాడు.

ధోనీ వర్సెస్ కార్తీక్: రికార్డుల లెక్కలు

ధోనీ, దినేష్ కార్తీక్ ఇద్దరి అంతర్జాతీయ కెరీర్‌లు భిన్నంగా సాగినప్పటికీ, ఇద్దరూ భారత క్రికెట్‌లో అత్యుత్తమ కీపర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ధోనీ తన కెరీర్‌లో 538 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 829 మందిని అవుట్ చేసి (634 క్యాచ్‌లు, 195 స్టంపింగ్‌లు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. మరోవైపు కార్తీక్ 180 మ్యాచ్‌ల్లో 172 మందిని (157 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు) అవుట్ చేశాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ఇద్దరి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. ఐపీఎల్‌లో ధోనీ 190కి పైగా డిస్మిసల్స్‌తో టాప్‌లో ఉండగా.. కార్తీక్ 170 డిస్మిసల్స్‌తో రెండో స్థానంలో నిలిచి తన కెరీర్‌ను ముగించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?