తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. మంగళవారం, బుధవారం, శుక్రవారం నాడు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి తెలంగాణ, కర్ణాటక మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణకు బుధవారం నాడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాక. గురువారం, శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాలో మంగళవారం నాడు(ఇవాళ) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్ద ఎత్తున వడగళ్లు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు వాతావరణ కేంద్రం అధికారులు. ఇక హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పారు. భారీ స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలాఉంటే.. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో భారీ వర్షం కురుస్తోంది. మండలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి చేరిన వరదనీరు, కదల్లేని పరిస్థితుల్లో జనం అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..