AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంలో 65 కొత్త జబ్బులకు చికిత్స.. ప్రస్తుతం ఉన్న చికిత్సలకు ప్యాకేజ్ పెంపు

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్..

Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంలో 65 కొత్త జబ్బులకు చికిత్స.. ప్రస్తుతం ఉన్న చికిత్సలకు ప్యాకేజ్ పెంపు
Aarogyasri
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 08, 2024 | 9:04 PM

Share

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకం కింద కొత్త చికిత్సా విధానాల కొరకు, ప్రస్తుతము ఉన్న పథకాల ఆర్థిక సవరణ కొరకు మంత్రివర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లుతో జూన్ 7న రాష్ట్ర సచివాలయం లో సమావేశము జరిగింది.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము 2007 లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యము అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకం ప్రెవేశపెట్టారు. ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 10 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఈ పథకం ద్వారా అందుతుంది. రాష్ట్రం లో ఈ సదుపాయము 1402 ఆసుపత్రుల ద్వారా అందించబడుతుంది. ప్రస్తుతము ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూస కు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189.83 కోట్ల ఖర్చు ప్రభుత్వం పై పడనుంది. అంతే కాక, 65 కొత్త చికిత్సా విధానాలు అంగీకరించడం వల్ల ప్రభుత్వo 158.20 కోట్ల ఖర్చు చేయనుంది. పై సవరణల వల్ల, కొత్త చికిత్సా విధానాలు చేర్చడం కోసం ప్రభుత్వం అదనంగా 497.29 కోట్లు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంజూరు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న జబ్బుల్లో 1375 జబ్బులకు ప్యాకేజీ ధరలను పెంచుతూ రూ.480 కోట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి