చిట్టి గుండెకు పుట్టెడు కష్టం.. దైవంపై భారంవేసి భక్తుడిగా మారిన ఓ బాలుడి విషాద గాథ!
నాడు భక్త ప్రహ్లాద.. నేడు బాల మణికంఠ.. తన ప్రాణం కోసం ఏడాది వయసు నుంచి 11 ఏళ్ల వయసులోనూ భక్తి పారవశ్యంతో భక్త ప్రహ్లాదను మించిన బాలుడు. తన చిన్ని గుండెకు మూడు రంధ్రాలు ఉండటంతో దైవం పైనే భారం వేసి ఆధ్యాత్మికంగా భక్త ప్రహ్లాదగా మారాడు బాల మణికంఠ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో 11 ఏళ్ల బాలుడు భక్తి పాటలతో వీధుల్లో తిరుగుతూ..

ఖమ్మం, సెప్టెంబర్ 1: నాడు భక్త ప్రహ్లాద.. నేడు బాల మణికంఠ.. తన ప్రాణం కోసం ఏడాది వయసు నుంచి 11 ఏళ్ల వయసులోనూ భక్తి పారవశ్యంతో భక్త ప్రహ్లాదను మించిన బాలుడు. తన చిన్ని గుండెకు మూడు రంధ్రాలు ఉండటంతో దైవం పైనే భారం వేసి ఆధ్యాత్మికంగా భక్త ప్రహ్లాదగా మారాడు బాల మణికంఠ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో 11 ఏళ్ల బాలుడు భక్తి పాటలతో వీధుల్లో తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. సహజంగా చిన్న పిల్లలు అంటే ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు..వారికి లోకం పోకడలు తెలియని కల్మషం ఎరగని చిన్నారులు. కానీ సత్తుపల్లి మున్సిపాలిటీలోని బైపాస్ రోడ్డులో బాల మణికంఠ అనే 11 ఏళ్ల బాలుడు ఆద్యాత్మిక భక్తి పారవశ్యంతో తాను ఆడే ఆటల లోనూ పాటల లోనూ భక్తి ను చాటుతున్నాడు. దీని వెనుక ఓ విషాద గాథ ఉంది.
బాల మణికంఠ పుట్టిన 21 రోజులకే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తల్లి తండ్రులు ఆ బాలుడు ను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ బాబు గుండెకు మూడు రంధ్రాలు ఉన్నాయని చెప్పడంతో తల్లి తండ్రులకు గుండె ఆగినంత పని అయ్యింది. ఆర్థిక పరిస్థితి బాగలేక పోవడంతో అప్పులు చేసి కొంత మేరకు వైద్యం చేయించారు. ఏ దిక్కు…లేనప్పుడు దేవుడే దిక్కని భావించిన తల్లి తండ్రులు కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామి దీక్ష ధరించి దేవుడు పై భారం వేశారు. అలా ..ఆ బాలుడు చిన్న తనం నుంచి దేవుడు మీద భక్తితో ఆధ్యాత్మికంగా భజన పాటలు పాడుతూ… ఆదుకుంటాడు. ప్రస్తుతం 3 వ తరగతి చదువుతున్నాడు. తనకు రోషన్ అనే ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. బాల మణికంఠ ఒక చిన్న చెక్క పీఠ మీద అమ్మవారి విగ్రహం, శివ లింగం ఉంచి అభిషేకం చేసి..ఒక ప్లేట్ లో నిప్పు రవ్వలు వేసి సాంబ్రాణితో దూపం వేస్తూ…వీధుల్లో భక్తి తో భజన పాటలు పాడుతూ తిరుగుతారు. చూసే వారికి విచిత్రంగా ఉన్నప్పటికీ…ఆ బాల మణికంఠ గుండెల్లో దేవుని పై నమ్మకం, భక్తి, తన ప్రాణాలను కాపాదుతుందని ఒక బలమైన సంకల్పం తో జీవిస్తున్నాడు. 21 రోజు పసి బిడ్డ నుంచి ఇప్పుడు 11 ఏళ్ల బాలుడు గా ఎదిగాడు. నాటి నుంచి దేవుడు పై భక్తి తప్ప మరొకటి తెలియదు.
కానీ గుండెలో రంధ్రాలు ఉన్నాయి. ప్రాణానికి ప్రమాదం ఉందని తన కు ఊహ తెలిసిన నాటి నుంచి తెలుసుకున్న బాల మణికంఠ తనకు ఆ దేవుదే దిక్కు అని లేచిన దగ్గర నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు దేవుడు బొమ్మలు, దేవుడు విగ్రహాలు,పూజలు,భజన పాటలు తో… బాల మణికంఠ మరో భక్త ప్రహ్లాదుడు గా మారిపోయాడు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.