బాబోయ్ 10 అడుగులు కొండచిలువ.. ఏకంగా ఇంట్లోకి వచ్చింది.. ఏం చేశారంటే..?
జనావాసాల్లో భారీ సైజు కొండచిలువ... 10 అడుగుల పొడవున్న పైథాన్... చూస్తేనే వళ్లు గగుర్పొడిచేలా భయానకంగా ఉంది. ఒక్కసారిగా ఇంట్లో ప్రత్యక్షమైంది. బెంబేలెత్తిపోయిన ఆ ఇంట్లోని వారు తలోవైపు పరుగులు తీశారు. కొత్తగూడెం గౌతమ్ నగర్‌లో జరిగిందీ ఘటన. అప్రమత్తమైన స్థానికులు... ఫారెస్ట్ అధికారులకు కబురు పెట్టారు. వెంటనే వచ్చిన స్నేక్ టీమ్... కొండచిలువను చెరబట్టి బోనులో బంధించారు. ఆపై దాన్ని దూరంగా తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు.
సర్పాలంటే ప్రతి ఒక్కరికీ అంతు లేని భయం..! విష పూరితమైన సర్పాలంటే గుండెల్లో దడ…! పాము కాటేస్తే కాటికెళ్లాల్సిందే అనే భయంతో.. అవి కనబడగానే మట్టుపెట్టేస్తారు. కానీ.. పాములలో ఎన్నో రకాల జాతులు విషం లేనివే. పర్యావరణ పరిరక్షణలో పాములు ప్రధాన భూమిక పోషిస్తాయి. అయితే పాములు కనిపిస్తే వెంటనే వాటిని అటాక్ చేసి.. చంపకుండా.. తమకు సమచారం ఇవ్వాలంటున్నవారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు. అలా చేస్తే.. దాన్ని రెస్క్యూ చేసి అడవుల్లో వదిలేస్తామని చెబుతున్నారు. తాజాగా ఫారెస్ట్ సిబ్బంది స్నేక్ క్యాచర్ సాయంతో 10 అడుగుల కొండచిలువను కొత్తగూడెంలో బంధించారు.
Published on: Sep 01, 2023 04:56 PM