Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాలుడిని పగబట్టిన పాము.. 2 నెలల్లో 9 సార్లు కాటు..! వీడియో.

Viral Video: బాలుడిని పగబట్టిన పాము.. 2 నెలల్లో 9 సార్లు కాటు..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 01, 2023 | 9:10 PM

పాము పగబడితే ఏళ్లు అయినా వదిలిపెట్టదు అంటారు. కానీ, సైన్స్‌ మాత్రం పాములు పగబట్టవు అంటోంది. కొన్ని సార్లు ఆ సైన్స్‌కు కూడా అంతుచిక్కని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఒకే వ్యక్తిని ఒకే పాము పలుమార్లు కాటు వేసిన సంఘటనలు చాలా జరిగాయి. తాజాగా, కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది. ఓ నాగు పాము ఓ బాలుడ్ని పగబట్టిందనిపించేలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. రెండు నెలల్లో 9 సార్లు కాటు వేసింది.

పాము పగబడితే ఏళ్లు అయినా వదిలిపెట్టదు అంటారు. కానీ, సైన్స్‌ మాత్రం పాములు పగబట్టవు అంటోంది. కొన్ని సార్లు ఆ సైన్స్‌కు కూడా అంతుచిక్కని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఒకే వ్యక్తిని ఒకే పాము పలుమార్లు కాటు వేసిన సంఘటనలు చాలా జరిగాయి. తాజాగా, కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది. ఓ నాగు పాము ఓ బాలుడ్ని పగబట్టిందనిపించేలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. రెండు నెలల్లో 9 సార్లు కాటు వేసింది. కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకా హలకటి గ్రామానికి చెందిన ప్రజ్వల్‌ అనే బాలుడి జీవితం రెండు నెలల ముందు వరకు సాధారణంగానే ఉండేది. పదవ తరగతి చదువుతున్న అతడి జీవితం జూలై నెలలో ఓ కీలక మలుపు తిరిగింది.

జులై 3వ తేదీ మొదటి సారి అతడ్ని ఓ త్రాచు పాము కరిచింది. ప్రజ్వల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లో ఉండగా పాము కాటు వేయటంతో తల్లిదండ్రులు ఆ ఇళ్లు, ఊరు విడిచి వెళ్లిపోయారు. చిత్తాపురలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే, ఇళ్లు.. ఊరు విడిచిన తర్వాత కూడా పాము అతడ్ని కరిచింది. ఇలా రెండు నెలల్లో 9 సార్లు ఆ పాము అతడ్ని కరిచింది. ఇన్ని సార్లు ప్రజ్వల్‌ను పాము కరిచినా.. ఒక్కసారి కూడా ఆ పామును కుటుంబసభ్యులు ఎవ్వరూ చూడలేదు. ఆ పాము కేవలం ప్రజ్వల్‌కు మాత్రమే కనిపిస్తోందట. 9 సార్లు పాము కరవగా.. 6 సార్లు ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయిన రెండు, మూడు రోజుల్లోనే పాము మళ్లీ అతడిపై దాడి చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..