AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicine from the Sky: చరిత్ర సృష్టించనున్న తెలంగాణ.. దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్.. నేడే శ్రీకారం

రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మెడిసిన్స్, వ్యాక్సిన్లు సరఫరా చేసే.... మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు తెలంగాణలో ఇవాళ ప్రారంభం కానుంది.

Medicine from the Sky: చరిత్ర సృష్టించనున్న తెలంగాణ.. దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్.. నేడే శ్రీకారం
Medicine From Sky
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2021 | 9:20 AM

Share

రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసే…. మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. వికారాబాద్​లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో.. నెలరోజులపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయోగాత్మక పరిశీలన జరగనుంది. రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో.. మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టుకు ప్రభుత్వం అంకురార్పణ చేసింది.  కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి నేడు లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి.. రాష్ట్ర ఐటీశాఖ సహకారం తీసుకుంది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు మెడిసిన్ సరఫరా చేయటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.  వికారాబాద్​లో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కేంద్రం నుంచి అన్ని పర్మిషన్స్ వచ్చాయి.  మారుట్ డ్రోన్స్, బ్లూ డార్ట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు రెండ్రోజులుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రయల్ రన్స్ పూర్తి చేసుకున్నాయి. మొదటి రోజు ట్రయల్ రన్​లో భాగంగా… విజువల్ లైన్​కు ఇవతలివైపు 400 మీటర్ల ఎత్తు వరకు మెడిసిన్ బాక్సును ఈ సంస్థల డ్రోన్లు తీసుకెళ్లాయి. డ్రోన్లు ఎంత కెపాసిటీ పేలోడ్స్​ను తీసుకెళ్తాయి. ఎంత దూరం వెళ్తాయనే అంశాలను నెలరోజుల ప్రయోగాత్మక పరిశీలనలో గుర్తిస్తారు.

ఎక్కువ దూరం, బరువైన పేలోడ్స్ తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు అవసరమనే అంశాలపై అనాలిసిస్ కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే విజువల్​లైన్​కు ఆవతల వైపు… డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా.. తెలంగాణ రికార్డు క్రియేట్ చేయనుంది. ఈ ప్రాజెక్టు విజయం ద్వారా ఎమర్జింగ్ రంగాల్లో పనిచేస్తోన్న విదేశీ కంపెనీలు…. హైదరాబాద్​లో తమ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు ఆస్కారం ఉంటుంది.

Also Read: ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడి చితికి తలకొరివి పెట్టిన అమ్మ

ఈ ఫోటోలోని వ్యక్తి టాలీవుడ్‌లో చాలా ఫేమస్.. హీరోగా కూడా చేశారు.. ఎవరో గుర్తించగలరా..?