FBO Results: ‘ఎఫ్‌బీవో’ పరీక్ష ఫలితాలు విడుదల.. 340 మంది అభ్యర్థుల ఎంపిక.. మిగత పోస్టుల ఎంపిక ఎప్పుడంటే..

FBO Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన...

FBO Results: ‘ఎఫ్‌బీవో’ పరీక్ష ఫలితాలు విడుదల.. 340 మంది అభ్యర్థుల ఎంపిక.. మిగత పోస్టుల ఎంపిక ఎప్పుడంటే..
Tspsc
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 22, 2021 | 7:34 AM

FBO Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఎఫ్‌బీవో ఫలితాలు విడుదల చేయాలని హైకోర్టు రెండేళ్ల క్రితమే ఆదేశించింది. అయితే, టీఎస్‌పీఎస్సీ మాత్రం ఫలితాల విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి 340 మంది అభ్యర్థులను ఎఫ్‌బీఓ పోస్టులకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. మిగతా పోస్టుల భర్తీకి పలు సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

హైకోర్టులో కేసులు, ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ధ్రువ పత్రాల విషయంలో వివాదాల వల్ల మిగతా పోస్టులను పెండింగ్‌లో పెట్టామని తెలిపింది. అయితే, వీటీ భర్తిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను త్వరలోనే ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. కాగా, తాజా ప్రకటనలో అర్హుల లేకపోవడం వల్ల ఒక పోస్టును భర్తీ చేయడం లేదని తెలిపింది. ఎఎఫ్‌బివో పోస్టులకు ఎంపిక అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, హాల్‌టికెట్ నెంబర్ ఆధారంగా అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చునని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. తెలంగాణ అటవీశాఖలో 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ 2017 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించింది. అయితే, కోర్టు కేసులు, వివిధ కారణాల చేత ఫలితాల విడుదలలో ఆలస్యం చేశారు. తాజాగా 340 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేశారు.

Also read:

Thieves Drill Hole Bank: దేశ రాజధాని ఢిల్లీలో భారీ దోపిడీ.. గోడను తవ్వి బ్యాంకుకు కన్నం.. లబోదిబోమంటున్న ఖాతాదారులు!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!