Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. జీహెచ్ఎంసీ తరువాత ఆ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు..
Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకూ ప్రమాదకరంగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం
Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకూ ప్రమాదకరంగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 6,542 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కోవిడ్-19 బులిటెన్ ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,67,901 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,876కి చేరింది.
ఇదిలాఉంటే.. నిన్న కరోనా నుంచి నిన్న 2,887 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,19,537 కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 46,488 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,30,105 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటివరకు 1,20,73,090 పరీక్షలు నిర్వహించారు.
నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 898 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వతా.. మేడ్చెల్ జిల్లాలో 570 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 532, నిజామాబాద్ జిల్లాలో 427, సంగారెడ్డి జిల్లాలో 320, నల్లగొండ జిల్లాలో 285 కేసులు నమోదయ్యాయి.
Also Read: