అధికార కాంగ్రెస్‌పై పవర్ ఫుల్ ఫైట్‌కి సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు.. పక్కా ప్లాన్‌తో ప్రజాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ తీరును ఎండగడుతూ నవంబర్‌లో ఉద్యమానికి కాషాయం పార్టీ సై అంటుంటే.. కాంగ్రెస్ వన్ ఇయర్ పాలనపై పోరాడుతామంటూ డిసెంబర్‌ను ఫిక్స్ చేసుకుంది బీఆర్‌ఎస్. మరోవైపుత ఎవరెలా వచ్చినా ఏం చేయలేరంటోంది అధికార కాంగ్రెస్. దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ నుంచి ప్రజాసమస్యలపై ఉద్యమిస్తామని క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఒక్క ఇళ్లు కట్టలేదు. పేదలకు ఒక్క ఇళ్లు పంచలేదు… గ్యారంటీలు రోడ్డున పడ్డాయన్నారు. హామీల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ఇక డిసెంబర్‌తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది…? ఎన్ని గ్యారంటీలు అమలు చేసింది…? ఎన్ని హామీలు నెరవేర్చింది…? అంటూ బీఆర్ఎస్ సైతం ప్రభుత్వంపై ఫైట్‌కి సిద్ధమవుతోంది. డిసెంబర్‌లోనే గులాబీ దళపతి రంగంలోకి దిగుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
రాష్ట్రంలో రాజకీయం రగులుతున్నా బయటకు రాలేదు కేసీఆర్. ఓవైపు రుణమాఫీ పాలిటిక్స్… మరోవైపు హైడ్రా మంటలు.. ఇంకోవైపు మూసీ ప్రక్షాళనపై రాజకీయం ఓ రేంజ్‌లో నడుస్తున్నా…కేసీఆర్ బయటకు రావడం లేదు. ప్రభుత్వం వైఫల్యాలపై ఎలా ముందుకెళ్లాలో కూడా కేడర్‌కు దిశానిర్దేశం చేయలేదు. అంతేకాదు ఆ మధ్య తెలంగాణలో భారీ వరదలు ముంచేత్తిన సమయంలోనూ కేసీఆర్ జనం మధ్యకు రాలేదు. కౌశిక్‌రెడ్డి ఇష్యూ జరిగినా కేసీఆర్ మౌనం వీడలేదు. ఈవన్నీ అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావే మాట్లాడుతున్నారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోనే ఉంటున్నారు. కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రెస్‌నోట్లు కూడా ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రావట్లేదని రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఇదే అంశాన్ని క్యాష్ చేసుకుంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడంపై మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అధికార పార్టీ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ వస్తోంది బీఆర్‌ఎస్. కేసీఆర్‌కి ఎప్పుడు ప్రజల్లోకి రావాలో తెలుసంటున్నారు గులాబీ నేతలు.
ఇక ఇన్ని ఇష్యూస్ ఉన్నా కేసీఆర్ రియాక్ట్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన మేలేంటో..నష్టమేంటో ప్రజలకే అర్థం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఏడాది సమయం ఇచ్చి… ఇప్పుడు విమర్శించినా ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదని.. ఆలోపే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొద్దని గులాబీ బాస్ అనుకుంటున్నారట. మరి కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తైన తర్వాతైనా గులాబీ దళపతి ఫీల్డ్‌లోకి దిగుతారా..? లేదా అన్నది చర్చనీయాంశమైంది.
మొత్తంగా… అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిసైడ్ అయ్యాయి. ఇలా ఇయర్ ఎండ్ పాలిటిక్స్ ఇంకెంత ఆసక్తికరంగా మారుతాయో చూడాలి మరి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..