TSRTC Bus Tickets: గ్రేటర్‌ వాసులకు ఆర్టీసీ షాక్‌.. ఆ టికెట్‌పై రాయితీ ఎత్తివేత!

|

Aug 03, 2023 | 8:40 AM

తెలంగాణ ఆర్టీసీ టీ24 టికెప్‌పై ఇచ్చిన రాయితీని తొలగించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి గతంలో పలు టికెట్లపై టీఎస్‌ ఆర్టీసీ రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరవాసుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. వీటిల్లో భాగం 24 గంటల ఒక రోజు బస్సు పాస్‌పై రాయితీలిచ్చింది. నగరంలో ప్రయాణికులు..

TSRTC Bus Tickets: గ్రేటర్‌ వాసులకు ఆర్టీసీ షాక్‌.. ఆ టికెట్‌పై రాయితీ ఎత్తివేత!
TSRTC
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 3: తెలంగాణ ఆర్టీసీ టీ24 టికెప్‌పై ఇచ్చిన రాయితీని తొలగించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి గతంలో పలు టికెట్లపై టీఎస్‌ ఆర్టీసీ రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరవాసుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. వీటిల్లో భాగం 24 గంటల ఒక రోజు బస్సు పాస్‌పై రాయితీలిచ్చింది. నగరంలో ప్రయాణికులు నిత్యం ఈ బస్సు పాస్‌ తీసుకుని ప్రయాణాలు చేసేవారు. ఐతే టీ24 టికెట్‌ ధర గతంలో రూ.120 ఉండగా.. దానిని రూ.100కి తగ్గించింది. తాజగా ఈ టికెట్‌పై ప్రకటించిన రాయితీని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఇప్పుడు వాటిని తొలగించింది.

దీంతో గతంలో మాదిరే 24 గంటలూ ఉపయోగపడే ‘ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌’ టి-24 బస్సు పాస్‌ ధర యథాతథంగా రూ.120కి అమ్ముతోంది. గతంలో ఈ పాస్‌లను వృద్ధులు, మహిళలకు కేవలం రూ.80లకే అందజేసింది. అలాగే సాధారణ ప్రయాణికులకు రూ.90లకు విక్రయించేది. ఇప్పుడు ఈ రాయితీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో 24 గంటలపాటు చెల్లుబాటు అయ్యే వన్‌ డే బస్సు పాస్‌ ధరను రూ.120 చేసింది. మహిళలకు, 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అయితే ఈ టికెట్‌ను రూ.100కే ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.