Bullet Vinayakudu: ట్రెండ్ ఫాలో అవుతున్న గణనాథుడు.. కొత్తలుక్‌లో అందరినీ కట్టిపడేస్తున్నాడు..!
Bullet Vinayakudu: బొజ్జ గణపయ్యకు బోర్ కొట్టిందేమో.. ఎప్పుడూ ఒకే మాదిరిగా ఎందుకుండాలి అనుకున్నాడో ఏమో మరి. తాను కూడా ట్రెండ్‌కు దగ్గట్టుగానే తయారవుతానంటున్నాడు.
Bullet Vinayakudu: బొజ్జ గణపయ్యకు బోర్ కొట్టిందేమో.. ఎప్పుడూ ఒకే మాదిరిగా ఎందుకుండాలి అనుకున్నాడో ఏమో మరి. తాను కూడా ట్రెండ్‌కు దగ్గట్టుగానే తయారవుతానంటున్నాడు. మీరేమో.. ఏడాదికి ఏడాది.. కొత్తకొత్త యేషాలేస్తుంటారు. మరీ నన్నేమో.. అదే ఎలుక మీద ఎక్కి తిరగమంటారు.. అని ఫీల్ అయ్యాడేమో. అందుకే ఈసారి ట్రెండ్‌కు తగ్గట్లుగా వచ్చేశాడు. బుల్లెట్ గణేషుడిగా వచ్చేశాడు. ప్రస్తుతం బుల్లెట్ బండి గణేషుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. మరి ఆ గణనాథుడి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
వాస్తవానికి మన వద్ద వినాయక చవితి పండుగను చాలా గొప్పగా చేసుకుంటారు భక్తులు. తీరు తీరు రూపాలతో మండపాలల్లో గణపయ్యను నెలకొల్పుతారు. అయితే, ఓ చోట విచిత్రమైన వినాయకుడిని ప్రతిష్టించారు. ‘‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా’’ అని పాట ప్రస్తుతం ఎంత ట్రెండింగ్‌గా ఉందో అందరికీ తెలిసిందే. ఈ పాట మహత్మ్యం కాబోలు.. గణనాథుడు కూడా బుల్లెట్ బండిపై వచ్చేశాడు. ఎలుక నెక్కి రావడం అంటే లేట్ అవుతుందని అనుకున్నాడో ఏమో.. ఇలా బుల్లెట్ బండిపై వచ్చేశాడు. జనం బాధలు, కష్టాలు దీర్చేందుకు బుల్లెట్టు బండిమీద భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ వెరైటీ గణపయ్య విగ్రహం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేశారు భక్తులు. బాదేపల్లి వీర శివాజీనగర్ లో ఏర్పాటు చేసిన ఈ వెరైటీ లంబోధరుడు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.
ఈ మధ్యకాలంలో బుల్లెట్ బండి సాంగ్ డాన్స్ ఎంతగా వైరల్ అయితుందో అందరికీ తెలిసిందే. ఆ కాన్సెప్ట్‌తోనే.. బుల్లెట్ బండి మీద మట్టి గణపయ్య తయారు జేయించారు నిర్వాహకులు. బుల్లెట్ బండి మీదొచ్చిన విఘ్నేశుడ్ని జూసిన భక్తులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా అంతంజేయవయ్యా సామి అంటూ.. భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.
Also read:
Red Tamarind : ఎరుపు రంగులో చింతకాయలు.. వారి రక్తమే అందుకు కారణమట.. విచిత్ర చెట్టు వివరాలు మీకోసం..!
Face Mask: కొబ్బరి చిప్పతో మాస్క్.. అదేమంటే విజిల్ కోసమట.. చివరికి పోలీసుల కంటపడటంతో..