Telangana: తెలంగాణ వ్యాప్తంగా అట్టహాసంగా చెరువుల పండుగ.. సందండి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు..
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చెరువుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో జలాశయాల దగ్గర సందడి నెలకొంది. చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిబింబించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించారు. దీంతో అన్ని పల్లెల్లో చెరువులు కళకళలాడాయి.

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చెరువుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో జలాశయాల దగ్గర సందడి నెలకొంది. చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిబింబించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించారు. దీంతో అన్ని పల్లెల్లో చెరువులు కళకళలాడాయి.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహించింది ప్రభుత్వం. ఈ పండుగలో మత్స్యకారులను భాగస్వాములను చేయడంతో, గ్రామల నుంచి ఊరేగింపుగా జలాశయాల వద్దకు చేరుకుని సంబురాలు నిర్వహించారు. చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజల నిర్వహణతోపాటు, బోనాలు, బతుకమ్మలు, ప్రగతి నివేదిక ప్రదర్శన చేపట్టారు. సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం మిషన్‌కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులతోపాటు, మిషన్ కాకతీయ దాతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో మంత్రులతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో జరిగిన తెలంగాణ చెరువుల పండుగలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. చెరువు కట్ట మైసమ్మకు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ అమెర్ పూజలు చేశారు. ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత నృత్యం చేసి సందడి చేశారు. తెలంగాణ అభివృద్ధి చెరువులతోనే సాధ్యమైందని తెలిపారు.




ప్రజల్లో, వారు చేసే పనుల్లో కలిసిపోవడం ఎవరైనా మంత్రి ఎర్రబెల్లి తర్వాతే. ఏదో ఒక విధంగా అందరినీ ఆశ్చర్య పరిచే విధంగా దయన్న ప్రవర్తన ఉంటుంది. తాజాగా జాలర్లతో కలిసి చేపలు పట్టి అబ్బురపరిచారు మంత్రి ఎర్రబెల్లి. జనగామ జిల్లా కొడకండ్ల రంగాపురం గ్రామంలో ముదిరాజ్‌లతో కలిసిచెరువుల పండుగలో పాల్గొన్నారు మంత్రి. మృగశిర కార్తె రోజు మంత్రి చేపలు పట్టడం చూసి అక్కడున్న వారంతా కేకలు పెట్టారు..
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు చేపలు, రొయ్యలతో చేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు. రంగారెడ్డి జిల్లా స్థాయిలో భాగంగా సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పారిశ్రామిక మహిళా సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లనునేతలు పరిశీలించారు. అనంతరం చేపలు, రొయ్యలతో చేసిన వంటకాల రుచులను ఆస్వాదించారు.
మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సాగునీటి దినోత్సవం జరుపుకోవడం సిగ్గుచేటు అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ధరణి అక్రమాలపై మాట్లాడితే బంగాళా ఖాతంలో వేస్తామంటున్నారని, సాగుంటి ప్రాజెక్ట్ ల కోసం త్యాగం చేసిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..