Telangana – Modi: తెలంగాణపై ఇంత ‘కక్ష’ నా? ప్రధాని నరేంద్ర మోదీపై ఫైర్ అయిన మంత్రి తలసాని శ్రీనివాస్..

Minister Talasani Srinivas: తెలంగాణ(Telangana) పట్ల ప్రధాని మోదీ(PM Modi)లో విపరీతమైన ధ్వేషం ఉందని, పార్లమెంట్(Parliament) వేదికగా...

Telangana - Modi: తెలంగాణపై ఇంత ‘కక్ష’ నా? ప్రధాని నరేంద్ర మోదీపై ఫైర్ అయిన మంత్రి తలసాని శ్రీనివాస్..
Shiva Prajapati

|

Feb 08, 2022 | 4:41 PM

Minister Talasani Srinivas: తెలంగాణ(Telangana) పట్ల ప్రధాని మోదీ(PM Modi)లో విపరీతమైన ధ్వేషం ఉందని, పార్లమెంట్(Parliament) వేదికగా ఆయన చేసిన కామెంట్సే దీనికి నిదర్శనం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas) అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌పై రాష్ట్ర మంత్రులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తీవ్రంగా స్పందించారు. ప్రధానిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోందన్నారు. ప్రధాని మోదీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుమ్మెత్తిపోశారు. పార్లమెంటుకు రాని వ్యక్తి మోదీ అని విమర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను విడదీసి కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. నువ్వు ఏం న్యాయం చేశావో చెప్పు.’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నారంటూ దుమ్మెత్తిపోశారు. సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదన్నారు. తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోందన్నారు. ఏడున్నర సంవత్సరాల్లో ఆయన డ్రెస్ కోడ్ మారిందే తప్ప దేశ ప్రజల బతుకులు మారలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్.

ఇదే సమయంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం మళ్ళీ మొదలవుతుందని హెచ్చరించారు. అలాగే పీఎం పర్యటనకు సీఎం గైర్హాజరవడంపై స్పందించారు మంత్రి తలసాని. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ప్రతినిధిగా ఉంటే సరిపోతుందన్నారు. అయినా.. ప్రధాని పర్యటనను బైకాట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే పీఎంకు ఆహ్వానం చెప్పలేదని అంటున్న బీజేపీ నేతలకు చెబుతున్నాం.. ఉద్దేశ్య పూర్వకంగానే సీఎం వెళ్లలేదు. అయితే ఏంటి ఇప్పుడు. బీజేపీ వాళ్లకు మేం భయపడాల్సిన పని లేదు.’’ పిచ్చి కామెంట్స్ ఆపి.. రాష్ట్రం అడిగిన ఒక్క పని కేంద్రం చేయలేదని, ముందుగా దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పై ప్రతిపక్షాలు కుక్కరుపులు అరుస్తున్నాయంటూ ఘాటైన కామెంట్స్ చేశారు మంత్రి తలసాని. బీజేపీలో ఉన్నది.. నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్నవి ఒక్కటేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ఏ ఎంపీ ప్రశ్నించక ముందే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని లేవనెత్తారని, తెలంగాణపై ఆయనకున్న అక్కసే ఇందుకు కారణం అని ఫైర్ అయ్యారు. దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని మంత్రి తలసాని పేర్కొన్నారు.

Also read:

Project Engineer Jobs: బీటెక్‌/ఎంటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..సీడ్యాక్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

India Post Payments Bank: మీకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? మార్చి 5 నుంచి కొత్త నిబంధన!

Shah Rukh Khan: షారుక్ ఖాన్ నిజంగా ఆపని చేశాడా..? ఆగ్రహం వ్యక్తం చేసిన నటి ఊర్మిళ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu