Telangana Politics: ‘అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి’.. ఆ ముగ్గురూ ఎవరంటూ బీజేపీలో ఆసక్తికర చర్చ..!
Telangana BJP: అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. బోల్తా కోట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఇది బీజేపీలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్.
Telangana BJP: అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. బోల్తా కోట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఇది బీజేపీలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్. ఢీల్లీలో జరిగిన ఒక సీన్ ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ అయింది. పేర్లు బయటికి రావడం లేదు కానీ వారు ఎవరో కనుకున్నేందుకు అగ్ర నేతలు సైతం ప్రయత్నాలు చేస్తున్నారంట!.. ఇంతకు ఆ పాట ఎంటీ.. వారి కథ ఎంటీ.. ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాజకీయల్లో మంచి స్వింగ్ మీద ఉన్న బీజేపీ వరుస కార్యక్రమాలతో భవిష్యత్తు కార్యచరణ రచిస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వంపై కలిసి పోరాటం చేస్తూనే లోలోపల ఫీర్యాదులు చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఇటీవల జరిగిన అలాంటి ఒక సంఘటన బీజేపీలో హాట్ టాఫిక్ అయింది. బండి సంజయ్ మీద ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేసెందుకు వెళ్లిన ముగ్గురు అగ్రనాయకలుకు జరిగిన సంఘటన గురించి చర్చ నడుస్తోంది. కాని ఆ ముగ్గురు ఎవరు అనే దాని మీద కూడా అసక్తి నెలకొంది.
బండి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు. చర్చలు జరపకపోవడం వంటి ఫిర్యాదులతో ఢిల్లికి వెళ్లిన ముగ్గరు నేతలు విడివిడిగా వెళ్లి ఫిర్యాదు చేసారట. అయితే ఆ ఫిర్యాదులు పక్కన పెట్టి మీరు తెలంగాణలో పార్టీ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఎదురు ప్రశ్నలు వచ్చాయట. దీంతో కంగ్గు తిన్న ఆ నేతలు నోట మాట రాక తటపాటయించారట. బండి సంజయ్‌కు సహకరించడం, చొరవ తీసుకొని పని చేయండి కాని అర్ధంపర్ధం లేని ఫిర్యాదు చేయకండి అంటు చురకలంటించారట ఢిల్లీ కిలక నాయకుడు.
అయితే, ఇంతకూ ఆ ముగ్గరు ఎవరు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఉత్తర తెలంగాణకు చేందిన ఒక నేత, హైరదాబాద్, మహబూబ్ నగర్‌కు చెందిన మరోనేత ఉన్నారంటూ ఒక ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అగ్రనాయకులు సైతం అరా తీస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఎదో చెద్దాం అనుకొని వెళ్లిన నేతలకు మరేదో కావడంతో.. వారు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంలో ఉన్నారు కమలనాధులు.
Also read: