ECHS Secunderabad Jobs: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 8 తరగతి అర్హత.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ సికింద్రాబాద్ (Secunderabad), ఏపీ, తెలంగాణాల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల..
ECHS Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ సికింద్రాబాద్ (Secunderabad), ఏపీ, తెలంగాణాల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు: ఖాళీల సంఖ్య: 103
ఖాళీల వివరాలు: మెడికల్, పారా మెడికల్, నాడ్ మెడికల్ పోస్టులు
పోస్టుల వివరాలు: మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫ్యూన్, డ్రైవర్, క్లర్క్, డీఈవో తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
పే స్కేల్: నెలకు రూ.16,800ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 8వ తరగతి లేదా జీడీ ట్రేడ్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎల్టీ, జీఎన్‌ఎం, గ్రాడ్యుయేషన్, బీ ఫార్మసీ, బీడీఎస్, ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: 2022, మార్చి 9, 10, 11, 12, 14, 15, 16, 17, 19, 21 తేదీల్లో పోస్టును బట్టి ఈ కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అడ్రస్: Headquarters Telangana and Andhra sub area, Secunderabad.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి చేసిన దరఖాస్తులను పంపవల్సిన అడ్రస్: Station HQ ECHS Cell, c/o bison nrc complex, nag mandir road, trimulgherry post, secunderabad, telangana-500015.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2022
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: