Ministry of Defence Recruitment 2022: ఇంటర్ పాస్‌తో రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగ అవకాశాలు.. ఇలా అప్లై చేయండి..
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (CDM) , సైనిక్‌పురి పోస్ట్, సికింద్రాబాద్, లోయర్ డివిజన్ క్లర్క్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు..
Ministry of Defence Recruitment 2022: కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (CDM) , సైనిక్‌పురి పోస్ట్, సికింద్రాబాద్, లోయర్ డివిజన్ క్లర్క్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులందరూ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2022 (College of Defence Management Recruitment 2022) కోసం తమ దరఖాస్తును ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన జారీ చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సూచించిన చిరునామాకు పంపవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం..1 లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) మరియు 1 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్ట్ ఈ ప్రక్రియ ద్వారా రిక్రూట్ అవుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది. కాగా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతం ఉంటుంది.
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, కంప్యూటర్‌లో ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి. అదే సమయంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా, అభ్యర్థి వయస్సు LDC పోస్ట్‌లకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య, MTS పోస్ట్‌లకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. వివరణాత్మక సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
వ్రాత పరీక్ష, ప్రాక్టికల్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులందరూ CDM LDC, MTS రిక్రూట్‌మెంట్ 2022 కోసం తమ దరఖాస్తు ఫారమ్‌ను నిర్ణీత ఫార్మాట్‌లో, ఇతర అవసరమైన పత్రాలను నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు నిర్ణీత సమయంలో పంపించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయండి.
ఇవి కూడా చదవండి: TS RTC: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టీవీ9తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ ఇంటర్వ్యూ..