Project Engineer Jobs: బీటెక్/ఎంటెక్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సిల్చార్ (Assam)లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
CDAC Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సిల్చార్ (Assam)లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 37
ఖాళీల వివరాలు:
- ప్రాజెక్ట్ మేనేజర్లు: 2
- ప్రాజెక్ట్ లీడర్లు: 2
- ప్రాజెక్ట్ ఇంజనీర్లు: 9
- ప్రాజెక్ట్ అసోసియేట్లు: 11
- ప్రాజెక్ట్ టెక్నీషియన్లు: 4
- ప్రాజెక్ట్ ఆఫీసర్లు: 3
- ప్రాజెక్ట్ సపోర్ట స్టాఫ్: 6
విభాగాలు: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: hrd-sil@cdac.in
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: