AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘తెలంగాణ కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం కాంగ్రెస్’.. రేవంత్‌పై మరోసారి ఫైర్ అయిన కేటీఆర్..

తెలంగాణలో నాలుగైదు రోజుల నుంచి పవర్ పాలిటిక్స్‌ షాక్‌ కొడుతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అమెరికా పర్యటించిన రేవంత్‌రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

Telangana: ‘తెలంగాణ కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం కాంగ్రెస్’.. రేవంత్‌పై మరోసారి ఫైర్ అయిన కేటీఆర్..
Minister KT Ramarao
Shiva Prajapati
|

Updated on: Jul 16, 2023 | 8:22 PM

Share

తెలంగాణలో నాలుగైదు రోజుల నుంచి పవర్ పాలిటిక్స్‌ షాక్‌ కొడుతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అమెరికా పర్యటించిన రేవంత్‌రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్‌ టార్గెట్‌గా అధికార బీఆర్ఎస్ ఓ రేంజ్‌లో ఎటాక్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి ఫైరయ్యారు. ఇప్పుడున్న కాంగ్రెస్‌ ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కాదు.. తెలుగుదేశం కాంగ్రెస్‌ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. నాడు వ్యవసాయం దండ అంటే.. ఇప్పుడున్న టీ.కాంగ్రెస్‌ చీఫ్‌ ఆయన శిష్యుడు కాబట్టి.. రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలంటున్నారని మండిపడ్డారు కేటీఆర్‌.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు మంత్రి హరీశ్‌రావు. మూడు గంటల కరెంట్‌ చాలని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. చంద్రబాబుకు నిజమైన వారసుడు అనిపించుకున్నారని విమర్శించారు హరీశ్‌రావు. మరోవైపు.. కరెంట్‌ సబ్‌ స్టేషన్లలోని లాగ్‌ బుక్స్‌తో చర్చకు సిద్ధమా అన్న రేవంత్‌రెడ్డి సవాల్‌కు ప్రతిసవాల్‌ విసిరారు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి కొత్త బాసులు, పాత బాసుల హయాంలోని అన్ని కరెంట్‌ ఫైల్స్ బయటకు తీయడానికి రెడీగా ఉన్నామన్నారు.

మొత్తంగా.. తెలంగాణలో కరెంట్‌ రాజకీయం కాకరేపుతోంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరెంట్‌ మంటలు హైవోల్టేజ్‌ను తలపిస్తున్నాయి. మరో మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరెంటే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్