Telangana: ‘ఇష్టం వచ్చిన వారికే దళిత బంధు ఇస్తాం’.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..
Telangana: ప్రభుత్వ పథకాల అమలుపై కొందరు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదస్పదంగా మారుతున్నాయి.
Telangana: ప్రభుత్వ పథకాల అమలుపై కొందరు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదస్పదంగా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర అసహనంతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీకై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు. అక్కడ దళిత బంధు గురించి ఓ మహిళల ప్రశ్నించగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ‘‘మీకు ఓపిక లేకుంటే మేం ఏం చేయాలి. మా ఇష్టమొచ్చిన వాళ్లకు ఇచ్చుకుంటాం. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు’’ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంతేకాదు.. రూ. 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. ‘మీకు అనుభవం ఏం ఉంది.. ఏం చేసుకుని బతుకుతావో చెబితేనే దళిత బంధు ఇస్తాం’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇస్తున్న డబ్బు తెలంగాణ డబ్బని, ఇందులో కేంద్రానికి పైసా లేదన్నారు. కావాలంటే కేంద్రం దగ్గరకే వెళ్లి తెచ్చుకో అన్నారు మంత్రి ఇంద్రకరణ్. ఎవరి వెనకాల తిరుగుతున్నారో వాళ్లనే అడగాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..