Errabelli Dayakar Rao: సాయంకాలం వేళ గాలం చేతపట్టిన మంత్రి.. మత్స్యకారులతో కలిసి సరదాగా చేపల వేట..

సాయంకాలం పూట సరదాగా చేపలకు గాళం వేసిన ఆ మంత్రి చూపరులను ఆశ్చర్యపర్చారు. మత్స్యకారులతో కలిసి ముచ్చటగా కాసేపు చేపలు పట్టి సరదాపడ్డారు.

Errabelli Dayakar Rao: సాయంకాలం వేళ గాలం చేతపట్టిన మంత్రి.. మత్స్యకారులతో కలిసి సరదాగా చేపల వేట..
Minister Errabelli Dayakar
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2022 | 8:28 PM

సాయంకాలం పూట సరదాగా చేపలకు గాళం వేసిన ఆ మంత్రి చూపరులను ఆశ్చర్యపర్చారు. మత్స్యకారులతో కలిసి ముచ్చటగా కాసేపు చేపలు పట్టి సరదాపడ్డారు. మరి ఆ మంత్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సరదాగా ఇట్టే జనంతో మమేకమయ్యే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆదివారం ఓ సరదా సన్నివేశంలో భాగమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన తన పర్యటన ముగించుకొని హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంకు బయలు దేరారు.ఈ క్రమంలో మార్గ మధ్యలో నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం వద్ద దారిలో కొందరు చేపలు పడుతూ కనిపించారు. ఇంకేముంది వెంటనే తన కాన్వాయ్ ఆపి వాహనం దిగి, చేపలు పట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. వారిలో ఒకరి నుంచి గాలం కర్ర తీసుకున్నారు. ఆ గాలం కర్రను పట్టి చేపల కోసం వేట మొదలు పెట్టారు.

చేపల వేటలో వారితో మాటమంతి కలిపి తెలంగాణ వచ్చాక మత్స్యకారుల జీవితాలు ఎలా బాగుపడ్డాయో తెలుసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాక, చెరువులలో నీరు సమృద్ధిగా చేరాయని చెప్పారు. అలాగే కోట్ల కొలది చేపలను ఉచితంగా చెరువుల్లో వేస్తూ, చేపల విప్లవాన్ని తెచ్చారని చెప్పారు.

ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయని, తద్వారా చేపలు పట్టే వాళ్ళకు ఉపాధి, ఆదాయం పెరిగి, వాళ్ళ కుటుంబాలు ఉన్నతంగా బతుకుతున్నారు. ఇది సీఎం కేసీఆర్ సాధించిన గొప్ప విజయమని చెప్పారు మంత్రి. సబ్బండ కులాలకు, ఆయా కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చారని చెప్పారు. మంత్రి నేరుగా తమ వద్దకు వచ్చి కాసేపు సరదాగా వాళ్ళతో కలిసి చేపలు పట్టడంతో వళ్ళంతా సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..