Telangana : చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపిన ముల్లు

|

Jan 02, 2023 | 4:46 PM

ఓ చిన్న చేపముల్లు ఓ వ్యక్తికి కొన్నేళ్లుగా నరకం చూపించింది. అవును. నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన చేపలకూరతో భోజనం చేసాడు. అప్పుడు అనుకోకుండా చేపముల్లుని మింగేశాడు. 

Telangana : చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపిన ముల్లు
Fish Bone
Follow us on

ముల్లును ముల్లుతోనే తియ్యాలి అని నానుడి. అంటే ముల్లు అంత డేంజర్‌ అన్నమాట. కాలిలో ముల్లు గుచ్చుకుంటూనే దానిని తీసేవరకూ బాధను భరించలేం.. మరి అలాంటిది గొంతులో ముల్లు గుచ్చుకుని.. కడుపులోకి చేరుకుంటే.. అప్పుడు ఆ వ్యక్తి పడే బాధగురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా తెలంగాణాలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఓ చిన్న చేపముల్లు ఓ వ్యక్తికి కొన్నేళ్లుగా నరకం చూపించింది. అవును. నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన చేపలకూరతో భోజనం చేసాడు. అప్పుడు అనుకోకుండా చేపముల్లుని మింగేశాడు.

మెదక్‌ జిల్లా టేక్మాల్‌ కి చెందిన సాయిలు అనే వక్తి నాలుగేళ్ల క్రితం చేప కూరతో భోజనం చేస్తూ.. 2 అంగుళాల పొడవున్నచేపముల్లును మింగేసాడు. మొదటిలో ఏమీ అనిపించలేదు.. తర్వాత అతనికి కడుపలో నొప్పి బయలుదేరింది. దాంతో అతను పలు ఆస్పత్తుల్లో చికిత్స చేయించుకున్నాడు. నరకయాతన అనుభవించాడు. ఆయితే ఇటీవల 15 రోజులు క్రితం అతనికి కడుపునొప్పి ఎక్కువై భరించలేకపోయాడు. దాంతో సాయిలు వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళాడు. డాక్టర్స్ ను సంప్రదించాడు. అతనికి పరీక్షలుచేసిన వైద్యులు అతని కడుపులో చేపముల్లును గుర్తించి ఆపరేషన్‌ చేసి ముల్లును తొలగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..