Telangana: విషాదం.. కారుతో సహా వ్యక్తి సజీవదహనం.. హత్యా? ప్రమాదవశాత్తు జరిగిందా?

ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై కార్ తో సహా ఓ వ్యక్తి సజీవ దహనం ఆయన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఓ వ్యక్తి ఓఆర్ఆర్ నుంచి నానక్ రామ్ కూడా వైపు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారుతో సహా వ్యక్తి పూర్తిగా ఖాళీపూడిధై పోయాడు.ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు..

Telangana: విషాదం.. కారుతో సహా వ్యక్తి సజీవదహనం.. హత్యా? ప్రమాదవశాత్తు జరిగిందా?
Man Burnt Alive Along With His Car

Edited By:

Updated on: Nov 27, 2023 | 1:42 PM

కోదాడ, నవంబర్‌ 27: ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై కార్ తో సహా ఓ వ్యక్తి సజీవ దహనం ఆయన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఓ వ్యక్తి ఓఆర్ఆర్ నుంచి నానక్ రామ్ కూడా వైపు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారుతో సహా వ్యక్తి పూర్తిగా ఖాళీపూడిధై పోయాడు.ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

కారుతో సహా వ్యక్తి కూడా సజీవ దహనం అవ్వడం తో హత్య లేదా కారులోని మంటలు చెలరేగడంతో మృతి చెందాడా అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కోదాడకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి … ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని విదేశాలకు వెళ్ళేందుకు సిద్ధం అవుతున్నాడు. వెంకటేష్ తరుచూ నానక్ రామ్ కూడా వస్తూ.. వెళ్తూ.. ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. కోదాడ నుండి వచ్చిన వెంకటేష్ ఓఆర్ఆర్ ఎక్కి నానక్ రామ్ కూడా వైపు వెళ్తున్న సమయం లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘటన స్థలం లో కారు పూర్తిగా తగలపడి ఉండడమే కాకుండా వెంకటేష్ పూర్తిగా కాలి పోయి కారు పక్కనే పడిపోయి ఉన్నాడు. దింతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారును ఎవరైనా తగలపెట్టారా, ప్రమాదవశాత్తు ఘటన చోటుచేసుకుదా అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వెంకటేష్ మృతదేహన్నీ పోస్టుమార్టం కి తరలించారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే దానిపై క్లారిటీ రానుంది. ఇప్పటికే క్లూస్ టీం పలు ఆధారాలను సేకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.