AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus cases: తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి

ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Coronavirus cases: తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి
Coronavirus
Balaraju Goud
|

Updated on: Dec 19, 2023 | 12:32 PM

Share

తప్పిపోయిందీ అనుకున్న కరోనా ముప్పు.. రూపం మార్చుకుని మళ్లీ వచ్చేసింది. కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృభిస్తోంది..రెండురోజులుగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏకంగా మళ్లీ కరోనా మరణాలను పరిచయం చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్ళీ భయ ప్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది.

కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదని చెప్పారు.

ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రతగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు.

ఇక, దేశంలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది.. దేశంలో ఇప్పటివరకు కరోనా కొత్త వేరియంట్‌ బారిన పడి ఆరుగురు మృతి చెందారు.. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్ళీ భయ ప్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…