Viral News: సర్పంచ్ పోస్ట్ కావాలా?.. నోట్లు వద్దు.. కోతులను తరిమితే చాలు.. అభ్యర్థులకు సరికొత్త డిమాండ్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిల మేనియా కొనసాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇలా ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు చాలా గ్రామాల్లో ఒకే డిమాండ్ వినిపిస్తుంది.. మాకు ఓటుకు నోటు అక్కర్లే.. ఒక సమస్యను తీర్చుతే చాలంటున్నారు. గ్రామస్తులు.. మా సమస్యను ఎవరు తీరుస్తే వాళ్లకే ఓటేస్తామని చెబుతున్నారు. ఇంతకూ వాళ్ల సమస్య ఏంటో తెలుసుకుందాం పదండి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు ప్రజల నుంచి వినూత్న డిమాండ్‌లు ఎదురవుతున్నాయి. అదేంటంటే కోతులను తరిమేయడం. అవును మీరు విన్నది నిజమే.. తమ గ్రామంలో ఉన్న కోతులను ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్లకే ఓట్లేస్తామని గ్రాస్తులు తేల్చి చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెజార్టీ గ్రామాల్లో కోతుల సమస్య ఉంది. చాలా ప్రాంతాల్లో మనుషుల కంటే.. కోతుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో మనుషులు బయట తిరగాలంటే భయపడిపోతున్నారు.
అదొక్కటే కాదు ఈ కోతులు పంటలు సైతం నాశనం చేస్తున్నాయి. వరి మినహా.. మిగితా పంటలు వేయాలంటే రైతులు భయపడుతున్నారు. ఈ సమస్యపై గతంలో చాలా సార్లు స్థానికులు అటవి శాఖ అధికారులకు ఫిర్యాదు వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు గ్రామస్తులు తమ గోడును తెలియజేస్తున్నారు.
ఈ కోతుల బెదడ నుంచి తమను ఎవరైతే గట్టెక్కిస్తారో వాళ్లకే ఓట్లు వేస్తామని.. ప్రచారానికి వచ్చిన ప్రతి అభ్యర్థికి గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. దీంతో అభ్యర్థులకు కూడా అన్నింటికంటే ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది. దీంతో వారు ఈ సమస్యను కచ్చితంగా తీరుస్తామని గ్రామస్తులకు హామీ ఇస్తున్నారు. ఆయా గ్రామాల్లోని అభ్యర్థులు ఎన్నికల్లోపు కోతులను వెళ్లగొట్టి గ్రామస్తుల ఓట్లను పొందుతారో లేదా.. సమస్యను పరిష్కరించలేక ఓట్లను కోల్పోతారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
