AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వీళ్లు మనుషులు అనుకుంటే పొరపాటే.. మానవ మృగాలు..! ఏం చేశారో తెలిస్తే..

అదృశ్యమై బావిలో శవమై తేలిన నంబాల బాలిక డెత్ మిస్టరీ వీడింది. వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తే కామంతో కళ్లు మూసుకుపోయి ఆ చిన్నారిని చిదిమేశాడని పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తితో కలిసి క్రూరమృగంలా ప్రవర్తించి ఏడేళ్ల బాలికను అత్యంత అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం నంబాలలో చోటు చేసుకుంది‌.

Telangana: వీళ్లు మనుషులు అనుకుంటే పొరపాటే.. మానవ మృగాలు..! ఏం చేశారో తెలిస్తే..
Tg News
Naresh Gollana
| Edited By: Anand T|

Updated on: Dec 02, 2025 | 2:13 PM

Share

మదమెక్కిన మానవ మృగాల దాడిలో అభం శుభం తెలియని బాలిక బలైంది. వరుసకు పెద్దనాన్న అయ్యే కామాందుని కాటుకు‌ ఏడేళ్ల చిన్నారి హతమైంది. స్నేహితుడితో కలిసి అత్యంత క్రూరంగా బాలిక ను హింసించి బలి తీసుకున్నాడు ఆ రాక్షుసుడు. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం నంబాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో.. ఈ నెల 24న ఇంటి సమీపంలోని చింత చెట్టు కింద ఆడుకుంటున్న చిన్నారి మహన్వితను అపహరించాడు శనిగారపు బాపు అనే దుర్మార్గుడు. స్నేహితుడు ఉప్పారపు సతీష్ తో కలిసి బాలిక నోరు మూసి పక్కనే ఉన్న చేనులోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేసి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేసి పారిపోయాడు.

చీకటి పడినా బాలిక ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు తల్లిదండ్రులు. అర్థరాత్రి అయినా ఆచూకీ లభించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక అదృశ్యమైన మరుసటి రోజే లోతుగా విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో తనీఖీలు చేపట్టారు. వ్యచసాయ బావులు.. పొలాలు సమీప గోదావరి ప్రాంతం అంతా గాలించారు. అయినా పాప ఆచూకీ లభించలేదు. సీన్ కట్ చేస్తే మూడవ రోజు తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది.

బావిలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులువ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీపించి పరిశీలించారు. శరీరం ఉబ్బిపోయి ఉండటం, దుస్తువులపై రక్తపు మరకలు కనిపించడంతో బాలికను చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చిందని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు‌. అనుమానితులను అదుపులోకి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది బాలికకు పెదనాన్ని వరసయ్యే వ్యక్తి అతని స్నేహితుడే కారణమని పోలీసులు నిర్థారించారు. దీంతో వారిద్దరి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఏడేళ్ల పాప మహన్విత తల్లిదండ్రులది అతి బీద కుటుంబం.. తండ్రి శనిగారపు శేఖర్ మేకలు కాస్తుండగా, తల్లి రజిత వ్యవసాయ కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. విరి ఇంటి పక్కనే శనిగారపు బాపు అలియాస్ కట్టెల బాపు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను అక్రమ కలప దందా చేస్తుంటాడు. భార్య చనిపోవడంతో ఇతను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న బాపు కు అదే కాలనీలో ఉంటున్న ఉపారపు సతీశ్‌ అనే వ్యక్తితో దోస్తానా ఏర్పడింది. వీరిద్దరూ తరచూ మద్యం తాగుతూ, సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ జులాయిగా తిరిగేవారు.

అయితే ఈనెల 24 న ఆరు బయట ఆడుకుంటున్న మహన్విత ఈ రాక్షసుల కంట పడింది. చీకటి పడటం కాలనీలో ఎవరు లేక పోవడంతో చిన్నారిని అపహరించి సమీపంలోని పత్తి పొలాల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు దుండగులు. విషయం బయటకు పొక్కుతుందేమోనని.. చిన్నారిని గొంతు నులిమి హత్య చేసి బండరాయి కట్టి వ్యవసాయ బావిలో పడేశారు. మూడు రోజుల తర్వాత ఆ చిన్నారి మృతదేహం నీటిలో తేలింది.

ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎటు వెళ్లిన ఇంటికి తిరిగి వస్తుందనుకున్న కూతురు ఇలా బావిలో శవమై కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేకున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల విచారణలో ఈ విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. టెక్నికిల్ ఆదారలతో నిందుతులు శనిగారపు బాపు, ఉపారపు సతీష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

అయితే గ్రామస్తులు మాత్రం నిందితుడిని మాకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలిక మహన్విత చావుకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మానవమృగాలు ప్రాణాలతో ఉండకూడదని.. రేపటి రోజు మా పిల్లలను‌ కూడా ఈ మృగాలు కాటేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నామని.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని జిల్లా జడ్జికి రామగుండం కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా లేఖ రాయనున్నారని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.