Lok Bhavan: రాజ్‌భవన్ కాదు.. ఇక నుంచి లోక్ భవన్.. ఈ పేర్ల మార్పు వెనుక అసలు కథ ఇదే..
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ముఖ్యంగా.. పాలన భావన కేవలం పరిపాలనాపరమైనది కాదు. ఇది సాంస్కృతిక వైభవాన్ని తెలపడంతోపాటు.. నైతికమైనది అని గుర్తుచేసేలా.. వలసవాద పేర్లు, చిహ్నాలను రద్దు చేస్తోంది..

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ముఖ్యంగా.. పాలన భావన కేవలం పరిపాలనాపరమైనది కాదు. ఇది సాంస్కృతిక వైభవాన్ని తెలపడంతోపాటు.. నైతికమైనది అని గుర్తుచేసేలా.. వలసవాద పేర్లు, చిహ్నాలను రద్దు చేస్తోంది.. అంతేకాకుండా.. భారత ప్రజాస్వామ్యం అధికారం కంటే బాధ్యతను, హోదా కంటే సేవను ఎంచుకుంటోంది.. అనేలా.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. అందులో భాగంగా.. గవర్నర్‌ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్ పేర్లను ఇకపై లోక్ భవన్‌గా పిలవనున్నారు.. ‘ప్రజా సేవ’ అనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఈ మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.. దీనికి అనుగుణంగా.. కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది.. దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసం, కార్యాలయ భవనంగా ఉన్న ‘రాజ్ భవన్’ పేరును ‘లోక్ భవన్’గా మార్పు చేస్తున్నట్లు ఈ నెల 25వ తేదీన జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.. దేశంలో ఎక్కడా ‘రాజ్ భవన్’ అనే పదం అధికారికంగా ఉపయోగించరాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలో గవర్నర్ పదవి రాజన్యతకు ప్రతీక కాదని, ప్రజల ప్రతినిధిగా పనిచేసే వ్యవస్థ అనే ఉద్దేశంతో ‘లోక్ భవన్’ అంటే.. ప్రజల భవనం గా కొత్త పేరును ఎంచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయ. ఈ మార్పు ద్వారా రాజ్యాంగ గణతంత్ర విలువలను మరింత బలపరుస్తున్నట్లు పేర్కొంటున్నారు..
అయితే.. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వ సంస్థలు నిశ్శబ్దంగా.. లోతైన మార్పునకు గురవుతున్నాయి. పాలన భావన కేవలం పరిపాలనాపరమైనది కాదు. ఇది సాంస్కృతిక .. నైతికమైనది.. అంటూ మోదీ ప్రభుత్వం గుర్తుచేస్తోంది..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో, పాలనా స్థలాలు కర్తవ్యం – పారదర్శకతను ప్రతిబింబించేలా పునర్నిర్మించబడ్డాయి. ప్రతి పేరు, ప్రతి భవనం, ప్రతి చిహ్నం ఇప్పుడు ఒక సాధారణ ఆలోచనను సూచిస్తుంది.. ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ఉంది.. అనేలా ప్రతి నిర్ణయం ప్రతిబింబింస్తోంది.
అంతకుముందు రాజ్ పథ్ .. కర్తవ్య మార్గంగా మారింది. ఒక మైలురాయి వీధి ఇప్పుడు ఒక సందేశాన్ని కలిగి ఉంది. అధికారం ఒక హక్కు కాదు. ఇది ఒక విధి. వలసవాద పేర్లు, చిహ్నాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ చెప్పిన విధంగా.. ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని కర్తవ్యపథ్‌గా నామకరణం చేశారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని 2016లో సెవెన్ రేస్ కోర్స్ నుంచి లోక్ కళ్యాణ్ మార్గ్ గా పేరు మార్చారు.. ఇది ప్రత్యేకతను కాదు, సంక్షేమాన్ని తెలియజేసే పేరు. ఎన్నికైన ప్రతి ప్రభుత్వానికి ముందున్న పనికి గుర్తుగా అభిప్రాయపడ్డారు.
ప్రధాని కార్యాలయాన్ని సేవా తీర్థ్ అని నామకరణం చేశారు. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా – జాతీయ ప్రాధాన్యతలు రూపుదిద్దుకునేలా కార్యాలయాన్ని రూపొందించారు..
కేంద్ర సచివాలయానికి కర్తవ్య భవన్ అని పేరు పెట్టారు. ప్రజా సేవ అనేది ఒక నిబద్ధత అనే ఆలోచన చుట్టూ నిర్మించబడిన విశాలమైన పరిపాలనా కేంద్రం..
ఈ మార్పులు లోతైన సైద్ధాంతిక పరివర్తనను సూచిస్తాయి. భారత ప్రజాస్వామ్యం అధికారం కంటే బాధ్యతను, హోదా కంటే సేవను ఎంచుకుంటోంది. పేర్లలో మార్పు కూడా మనస్తత్వంలో, ఆలోచనల్లో మార్పును సూచిస్తుందని.. పేర్కొంటున్నారు.
నేడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. సేవ, కర్తవ్యం, పౌరులే ముందు పాలన అనే భాషను, ఆలోచనలను రేకెత్తించేలా.. గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్‌గా మార్చింది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




