Schools Bandh: తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్.. కారణం ఏంటంటే..?

Telangana Schools Bandh: తెలంగాణలో విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పేరుకుపోతున్నాయని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు శూన్యమని..

Schools Bandh: తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్.. కారణం ఏంటంటే..?
సెప్టెంబర్ నెలలో పబ్లిక్ హాలీడేస్.. రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, మిలాద్-ఉన్-నబీ పండుగల సెలవులు ఉన్నాయి.

Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 12, 2023 | 5:07 AM

Telangana Schools Bandh: తెలంగాణలో విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పేరుకుపోతున్నాయని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు శూన్యమని.. ఇకనైన ప్రభుత్వం స్పందించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నా.. ప్రభుత్వం వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లెప్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్స్ పేర్కొంటున్నాయి. విద్యా సమస్యలపై ఇటీవల భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ సైతం తూతూ మంత్రంగానే సాగింది తప్పా.. ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డాయి. ఫీజుల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్, తిరుపతిరావు కమిటీ నివేదికలు బహిర్గతం చేయకపోవడం సర్కారు సైతం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.

Student Organizations

ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. విద్యార్థులందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల చదువులు చెప్పే టీచర్లు లేక.. మరికొన్ని చోట్ల మౌళిక సదుపాయాలు లేవని పేర్కొంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేవని… మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్ వంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే బంద్ కు పిలుపునిచ్చినట్లు వామపక్ష విద్యార్థి సంఘాలు AISF, SFI, AIDSU, PDSU తెలిపాయి.

కాగా.. వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ కు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోషియేషన్ మద్ధతు తెలిపింది. అందరి అభిప్రాయాల సేకరణ తర్వాత బంద్ కు మద్ధతు తెలపాని నిర్ణయం తీసుకున్నట్లు TRSMA అధ్యక్షుడు శేఖర్ రావు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..