Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS New Fire Stations: మరో 18 కొత్త ఫైర్ స్టేషన్లు ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ.. ఎక్కడెక్కడంటే..

ఇటీవల కాలంలో జరిగిన అగ్నిప్రమాదపు ఘటనలలో, వరదలలో అగ్నిమాపక సిబ్బంది పడిన శ్రమ వర్ణతీతం. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయిన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అగ్నిప్రమాదపు ఘటనలలో, వరదలలో వేలాది మంది జీవితాలను కాపాడి శభాష్ అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఫైర్ అవుట్ పోస్టులతో సహా 146 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా 2,734 సిబ్బందితో 772 అగ్నిమాపక ఇతర వాహనాలతో ప్రస్తుతం పని చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు డిపార్ట్‌మెంట్‌లో 1841 మ్యాన్ పవర్..

TS New Fire Stations: మరో 18 కొత్త ఫైర్ స్టేషన్లు ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ.. ఎక్కడెక్కడంటే..
Home Minister Mahmood Ali
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Srilakshmi C

Updated on: Oct 06, 2023 | 3:39 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6: ఇటీవల కాలంలో జరిగిన అగ్నిప్రమాదపు ఘటనలలో, వరదలలో అగ్నిమాపక సిబ్బంది పడిన శ్రమ వర్ణతీతం. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయిన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అగ్నిప్రమాదపు ఘటనలలో, వరదలలో వేలాది మంది జీవితాలను కాపాడి శభాష్ అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఫైర్ అవుట్ పోస్టులతో సహా 146 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా 2,734 సిబ్బందితో 772 అగ్నిమాపక ఇతర వాహనాలతో ప్రస్తుతం పని చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు డిపార్ట్‌మెంట్‌లో 1841 మ్యాన్ పవర్ ఉండగా 93 అగ్నిమాపక కేంద్రాలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అగ్నిమాపక కేంద్రాలలో 46 శాతం సిబ్బందిలో 49 శాతం, అగ్నిమాపక వాహనాలలో 182 శాతం వృద్ధి చెందింది. ప్రభుత్వం సరికొత్త అగ్నిమాపక వాహనాలను సైతం కొనుగోలు చేయడంతో రాష్ట్రంలోని అగ్నిప్రమాద సమయంలో.. బాధితుల ప్రాణాలు రక్షించడం, ఆస్తులను కాపాడటానికి అవసరమైన అధునాతన పరికరాల సైతం అందుబాటులోకి వచ్చాయి.

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 18 ఫైర్ స్టేషన్లు ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్బీనగర్‌లోని ఫైర్ స్టేషన్‌ ప్రారంభించిన మహమ్మద్ అలీ మిగిలిన 17 ఫైర్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్, నారాయణపేట్ జిల్లాలో మక్తల్, మేడ్చల్ మల్కాజ్గిరి, ఎల్బీనగర్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, చంద్రయనగుట్ట, రాజేంద్రనగర్, షాద్నగర్ ,స్టేషన్ ఘన్పూర్ డోర్నకల్ ,నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురి, పినపాక, నందిపేట్‌లలో ఫైర్ స్టేషన్స్ ను ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదం, వరదలు వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఫైర్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. నగరంలో జరిగిన వరుస అగ్నిప్రమాదలు నగరవాసులకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. ఎంతో మంది పనులు, చదువు నిమిత్తం నగరానికి వచ్చి మృత్యువాత పడుతున్నారు. ఇంకా ఆ కుటుంబాలు తీరని విషాదంలో ఉన్నాయి. అలాంటి విపత్కర సందర్భంలో దట్టమైన పొగలు ఉన్న ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అగ్నిమాపక సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను రక్షించి, సురక్షితంగా వారిని కాపాడారు. డెక్కల్ మాల్, రూబీ మోటార్స్, పాలిక బజార్, సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ లాంటి ఘోరమైన అగ్నిప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయంలో అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి ఎంతో మంది కుటుంబాలలో వెలుగులు నింపారు.

ఇవి కూడా చదవండి

ఇక గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ విపరీతంగా కురిసినటువంటి వర్షాలకు ఎంతోమంది ప్రాణాలను కాపాడారు ఫైర్ సిబ్బంది. ఇటీవల భారీ వర్షాలకు గాను వరంగల్ లోని మోరంచేపల్లి లాంటి గ్రామాలు, భద్రాచలంలాంటి గోదావరి ప్రాంతాలలో ముందుగానే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వేలాది మంది జీవితాలను రక్షించి సురక్షితంగా వారిని వారి కుటుంబాలకు అప్పగించారు. అగ్ని ప్రమాదపు ఘటనల, వరద ఘటనలలో తెలంగాణ ఫైట్ సిబ్బంది పాత్ర కీలకంగా మారింది. అయితే ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అగ్నిమాపక సేవల శాఖకు 32.12 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.