JP Nadda: రజాకార్లతో పొత్తా.. బీఆర్ఎస్‌పై జేపీ నడ్డా విమర్శనాస్త్రాలు..
Telangana Assembly Elections: మోదీ పర్యటన తర్వాత తెలంగాణా రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందని, బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యామన్న వార్తల్ని గట్టిగా తిప్పికొట్టినట్టయిందని అభిప్రాయపడ్డారు నేతలు. పీఎం ఆవాస్ యోజన ద్వారా తెలంగాణలో రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బోగస్ అనీ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ మజ్లిస్‌కు ఊడిగం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణాకు ప్రమాదకరమని స్టేట్‌మెంట్ ఇచ్చారు టీ-బీజేపీ రథసారధి.

ప్రధాని మోదీ టూర్ తర్వాత సడన్‌గా టాప్‌గేర్‌లోకి వచ్చిన తెలంగాణా బీజేపీ.. అదే దూకుడు కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో.. జాతీయ నేతలంతా కొలువుదీరారు. తెలంగాణ బీజేపీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. అటు.. అసమ్మతిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలపై విమర్శల తాకిడి అమాంతం పెంచేశారు. వరుస సమావేశాలతో ఎన్నికలకు సమాయత్తమవుతోంది తెలంగాణా బీజేపీ. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు, పదాధికారులతో సమావేశమయ్యారు జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్. 18 అంశాల కార్యాచరణపై చర్చించి ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారు చేశారు.
మోదీ పర్యటన తర్వాత తెలంగాణా రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందని, బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యామన్న వార్తల్ని గట్టిగా తిప్పికొట్టినట్టయిందని అభిప్రాయపడ్డారు నేతలు. పీఎం ఆవాస్ యోజన ద్వారా తెలంగాణలో రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బోగస్ అనీ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ మజ్లిస్‌కు ఊడిగం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణాకు ప్రమాదకరమని స్టేట్‌మెంట్ ఇచ్చారు టీ-బీజేపీ రథసారధి.
ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం..
శుక్రవారం మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో బీజేపీ తెలంగాణా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జాతీయ కీలక నేతలు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, సునీల్ భన్సల్, తరుణ్ చుగ్… తెలంగాణాలో ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ..ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టాలన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. దేశ వ్యాప్తంగా గరిబ్ కళ్యాణ్ యోజన కింద 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ సప్లై చేసిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు.
ఇందులో తెలంగాణకి చెందిన రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని.. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 13కోట్ల మంది పేదరికాన్ని జయించారని అన్నారు. ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ను ఎందుకు అబివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4కోట్ల ఇళ్లను నిర్మించిందని.. మరీ తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని నిర్మించారో చెప్పాలని అన్నారు.
తెలంగాణలో 31 లక్షల స్వచ్ మూత్రశాలలు నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన… అంతేకాదు ఉజ్వల పథకం కింద సిలిండర్ కి 300 సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. దీంతో 9కోట్ల 50లక్షల మందికి లబ్ది చేకురనుందన్నారు. “నా చిన్నప్పుడు మా అమ్మ ఉదయానే అడవికి వెళ్లి కట్టెల్ తెచ్చి వంట చేసి స్కూల్ కి పంపించేదని.. మోదీ హయాంలో ఆ పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదన్నారు.
ఏడాదికి 6వేల కోట్లతో రైతుల ఖాతాలో కిసాన్ సమ్మన్ నిధి జమ అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. దీంట్లో 38లక్షల 50వేల తెలంగాణ రైతులు ఉన్నారని.. తెలంగాణ కి మోదీ ఇచ్చిన వాటన్నింటినీ చెప్పాల్సిన అవసరం ఉందా..? లేదా..? అని జేపీ నడ్డా ప్రశ్నించారు.
తెలంగాణ లో బీజేపీ గెలవాలి .. దాంతో పాటు మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తేవాలన్నారు జేపీ నడ్డా. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేస్ సంఖ్య పెరిగిందన్నారు. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో కొద్దిగా చూడాలని.. తొమ్మిది ఏళ్లలో 9లక్షల కోట్లను తెలంగాణకు కేటాయించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
రెండు రోజుల్లో 20వేల కోట్ల అబివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేశారని.. మరీ ఇక్కడున్న బీఆర్ఎస్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే కేసిఆర్ ను గద్దె దించల్సిన అవసరము ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు మోదీ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవశ్యకత కార్యకర్తలపై ఉందన్నారు. ఇచ్చిన హామీలనే కాదు.. చెప్పని హామీలను సైతం అమలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఫ్యామిలీస్ పార్టీలు మారుతున్నాయన్నారు. బీ అర్ ఎస్= బ్రస్టచర్ రిస్ట సమితి పార్టీ. బీ అర్ ఎస్ అంటేనే కేసిఆర్ కుటుంబం అని ఎద్దేవ చేశారు.ఏపీ లో రాజశేఖర్ రెడ్డి తర్వాత తనయుడు జగన్ పార్టీ నడుపుతున్నాడని.. ఆ పార్టీకి ఆయన చెల్లెలు కూడా దూరంగా ఉన్నారని విమర్శించారు.
పదవ తరగతి క్వశ్చన్ పేపర్, tspsc పేపర్ లీకేజి లకు పాల్పడిన ప్రభుత్వాన్ని తెలంగాణలో గద్దె దింపల్సిన అవసరం ఉందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి తో 30 లక్షల మంది యువత జీవితాలతో చెలగాటం అడుకున్నారని విమర్శించారు.
The BRS government, which has played with the future of youth in Telangana, needs to be defeated lock, stock, and barrel.
As Hon. PM Shri @narendramodi Ji has already iterated, BJP will not compromise with the corrupt but will contest them. pic.twitter.com/P1izbMKSYg
— Jagat Prakash Nadda (@JPNadda) October 6, 2023
తెలంగాణలో భారీ ప్లాన్..
ఈనెలలో తెలంగాణాలో 30కి పైగా సభలు నిర్వహించాలని ప్లాన్ చేసింది బీజేపీ. 10న, 27న రెండు విడతలుగా తెలంగాణా టూరేస్తారు హోమ్‌మంత్రి అమిత్‌షా. రాజేంద్రనగర్, ఆదిలాబాద్ బహిరంగసభల్లో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ తెలంగాణాలో పర్యటిస్తారు. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార పర్వం.. ఇలా పక్కా ఎలక్షన్ ఎజెండాతో దూకుడు పెంచేసింది బీజేపీ. అటు.. కొందరు ప్రధాని తెలంగాణ టూర్‌కు హాజరు కాని విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మరికొందరు నేతల తీరుపై ఫోకస్ పెట్టింది అధిష్టానం. 30 మందితో ఏర్పాటు చేసిన 14 ఎన్నికల కమిటీల్లో చోటు కల్పించి.. కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేసినా.. మిగతా నేతల్ని బుజ్జగించే పని కూడా అంతర్గతంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Addressed the inaugural session of BJP State Council Meeting in Distt. Medchal-Malkajgiri, Telangana, today.
BJP is the only party that has remained consistent with its vision since its inception. Our karyakartas are passionate about the nation’s progress and can offer… pic.twitter.com/wG90XJhknm
— Jagat Prakash Nadda (@JPNadda) October 6, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం