High Court: నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలుశిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
Telangana High Court: నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి..
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ నరేష్‌కు జైలు శిక్ష విధించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని.. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు ఇవ్వలేదని వారిపై అభియోగాలు దాఖలయ్యాయి. దంపతులకేసులో సుప్రీం ఆదేశాలు అధికారులు ధిక్కరించినట్లు కోర్టు తేల్చింది. అయితే ప్రస్తుతం వేసిన శిక్షపై అప్పీల్‌కు వెళ్లేందుకు వెసులు బాటు కల్పించింది కోర్టు. ఆరు వారాల పాటు శిక్షను నిలిపేసింది తెలంగాణ హైకోర్టు. విచారణ చేపట్టిన హైకోర్టు వీరికి 4 వారాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది.