Telangana: గురుకులాలకు సర్కార్ గుడ్ న్యూస్… సూపర్ న్యూస్

రేవంత్‌ సర్కార్‌ విద్యావ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. తాజాగా తెలంగాణ గురుకుల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.

Telangana: గురుకులాలకు సర్కార్ గుడ్ న్యూస్... సూపర్ న్యూస్
Telangana Government
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2024 | 9:43 PM

బీసీ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈఏపీసెట్, నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం మోడల్ స్కూల్స్ లో అమలవుతున్నట్లుగానే బీసీ గురుకులాల్లో కూడా పదవ తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని కొమురంభీమ్ భవన్ లో జరిగిన బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం కలిసి దిశా నిర్దేశం చేశారు. గురుకులాల్లో ఇంటర్ లో కంప్యూటర్ తో పాటు అన్ని కోర్సులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గురుకులాల్లో చదువుతున్న 8,9,10 తరగతి విద్యార్థులకు రెడ్ క్రాస్, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ లలో ప్రతి విద్యార్థి రెండిటిలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని ఈ నెల 15వ తేదీ నుంచి 31 లోపు ఈ గురుకులాల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దసరా లోపు రెంటెడ్ గురుకుల భవనాలకు 50 శాతం అద్దె చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. యజమానితో మాట్లాడి భవనాల్లో మౌలిక వసతులు కల్పించేలా వారితో మాట్లాడాలన్నారు. కింది స్థాయి నుంచి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలన్నారు పొన్నం ప్రభాకర్‌. ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పాఠశాలలో 1100 కోట్లతో 25 వేల స్కూల్‌లకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా బదిలీలు, ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయ లోకానికి 19 వేల ప్రమోషన్లు ,35 వేల బదిలీలు చేపట్టామని తెలిపారు. ప్రతి స్కూల్‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. శానిటేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్