Police Complaint: అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే బాండ్ పేపర్ రాసి ఇవ్వాల్సిందే!
సాధారణంగా ఎవరిమీదైన కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఓ వైట్ పేపర్ మీద కంప్లైంట్ రాసి ఇస్తే దానికి అవసరమైన చర్యలు తీసుకుని... ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ తీసుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఒకే ఒక్క చోట మాత్రం మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ముందుగా బాండ్ పేపర్ మీద నోటరీ చేసి తీసుకు రమ్మంటారు. అది ఎక్కడో, ఏమిటో, ఎందుకో చూద్దాం..
సికింద్రాబాద్, జులై 31: సాధారణంగా ఎవరిమీదైన కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఓ వైట్ పేపర్ మీద కంప్లైంట్ రాసి ఇస్తే దానికి అవసరమైన చర్యలు తీసుకుని… ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ తీసుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఒకే ఒక్క చోట మాత్రం మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ముందుగా బాండ్ పేపర్ మీద నోటరీ చేసి తీసుకు రమ్మంటారు. అది ఎక్కడో, ఏమిటో, ఎందుకో చూద్దాం..
ఈనెల 22న రమేష్ ఫ్యామిలీతో కలిసి కాకినాడ వెళ్ళేందుకు గౌతమి ఎక్స్ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లాడు. అయితే స్టేషన్లో జేబుదొంగలు అతని సెల్ ఫోన్ ని కొట్టేశారు. అమెరికా నుంచి తమ అబ్బాయి పంపించిన 13 ప్రో ఐఫోన్ కావడంతో రమేష్ ఎంతో బాధపడ్డాడు. ఫోన్ విలువ కూడా లక్ష పైనే. ట్రైన్ కదిలిన తర్వాత తన సెల్ ఫోన్ పోయిందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తెలిసిన బంధువులకు ఫోన్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని పంపించారు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఈ కంప్లైంట్ రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా బాండ్ పేపర్ మీద నోటరీ చేసుకొని కంప్లైంట్ ఇవ్వాలని కోరారు. ఇక హైదరాబాద్ తిరిగి వచ్చిన రమేష్ బాండ్ పేపర్ పై కంప్లైంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అయితే జి ఆర్ పి పోలీస్ స్టేషన్లో ఫిజికల్ గా కంప్లైంట్లు తీసుకోవట్లేదు. కేవలం ఆన్లైన్లో మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి అని సూచించారు. దాని కంటే ముందుగా మొబైల్ పోయిందనే విషయాన్ని 20 రూపాయల బాండ్ పేపర్ మీద నోటరీ చేయించి ఆ నోటరీ కాపీని స్థానికంగా ఉన్న ఈ సేవలో సబ్మిట్ చేయాలి. అక్కడ ఇచ్చే రిసిప్ట్ను తీసుకొని సికింద్రాబాద్ స్టేషన్ లో ఉన్న గవర్నమెంట్ రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దాని ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.