AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి?

హైదరాబాద్ మహానగరం పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి? ఆరు సంస్థలు దర్యాప్తులో తేలిన అసలు నిజాలేంటి? విద్యుత్‌ అక్రమ వాడకమా? ఏసీలను విపరీతంగా వాడ్డమే కారణమా? ఒక్కొక్కరిదీ ఒక్కో వెర్షన్‌ .మరి అసలు నిజాలేంటో తుది నివేదకలోనైనా తేలుతాయా?

Hyderabad: పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి?
Gulzar House Fire In Hyderabad
Balaraju Goud
|

Updated on: May 22, 2025 | 8:09 AM

Share
17 మందిని అందులో 8మంది చిన్నారులను మాయదారి మంటలు పొట్టనపెట్టుకున్నాయి. విషాద ఘటన అందర్నీ కలిచి వేసింది. ప్రమాదానికి కొన్ని గంటల ముందు చార్మినార్‌ను..గుల్జార్‌ హౌస్‌ను సందర్శించిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు  ఫైర్‌ యాక్సిడెంట్‌పై తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. మిస్‌ కెనడా తన ఆవేదనను వ్యక్తంచేస్తూ ట్వీట్‌ చేశారు.
ఇంతకీ అగ్నిప్రమాదానికి కారణాలేంటి?
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో ఏడు ఏసీల నిరంతర వాడకం వల్లనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఏసీ ఎగ్జాస్ట్ కు సరైన సౌకర్యం లేకపోవడంతో కంప్రెషర్ పేలినట్లు తేల్చారు. విద్యుత్‌ అక్రమ వాడకం..ఏసీ కంప్రెషన్‌లో సిలెండర్‌ పేలుడు, హైలోడ్‌కు తగినట్టుగా కేబుల్‌ సిస్టమ్‌ లేకపోవడం, ఇన్వర్టర్‌ లోపం ..ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన కారణాలు చెప్పారు. పలు కారణాలతో ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చాయి దర్యాఫ్తు బృందాలు. గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై కమిటీకి తుది నివేదిక సిద్ధం చేసింది. చార్మినార్‌ పోలీస్‌, ఫైర్‌, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్స్‌, ఫోరెన్సిక్‌ , ONGCతో పాటు నాగ్‌పూర్‌ నిపుణుల బృందం.. విచారణ జరిపారు.
ఇక క్లూస్‌ టీమ్స్‌ స్పాట్‌లో  25 రకాల ఆధారాలను సేకరించి వాటిని FSLకు పంపించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మూడు షాప్‌లు..ఫస్ట్‌ ఫ్లోర్‌లో 8 గదులు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్గదమయ్యాయి. జీ ప్లస్‌ 2 బిల్డింగ్‌లో  మొత్తం 8 ఏసీలు ఉన్నట్టు గుర్తించారు. షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమని క్లూస్‌ టీమ్స్‌ అంచనాకు వచ్చాయి. ఏసీ కంప్రెషర్ సిలెండర్‌ పేలడంతో మంటలు ఎగిసి పక్కనే వున్న విద్యుత్ మీటర్లకు అక్కడి నుంచి చెక్క మెట్లకు వ్యాపించాయి. పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనాలకు మంటలు అంటుకోవడంతో తీవ్రత మరింత పెరిగింది..సరైన వెంటిలేషన్ లేకపోవడంతో ఏసీలను విపరీతంగా వాడటంవల్ల  ఒత్తిడి పెరిగి కంప్రెషర్ పేలినట్లు  అంచానాకు వచ్చారు
అలా ఎవరి వెర్షన్‌ వారిదే. మరి ఏది నిజం. ఎవరి నివేదిక నిజం. తుది నివేదిక ఏం తేలనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు బాధిత కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేశారు చార్మినార్‌ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..