Telangana: మూడు సెషన్స్, ఆరు పెట్టుబడులుగా గ్లోబల్ సమ్మిట్
మూడు సెషన్స్, ఆరు పెట్టుబడులన్నట్లు సూపర్‌డూపర్ సక్సెస్ అయ్యింది తెలంగాణ రైజింగ్-2025 గ్లోబల్ సమ్మిట్. ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలతో ఫలప్రదంగా ముగిశాయి రెండోరోజు సెషన్స్. ఉదయం 10గంటలనుంచే మొదలైన ప్యానల్ డిస్కషన్స్‌లో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించడంతో విలువైన సూచనలొచ్చాయి. ..

ఫ్యూచర్‌సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రెండోరోజు 10 గంటలకు మొదలైన ప్యానల్ డిస్కషన్స్ సాయంత్రం 5.30 గంటలదాకా సాగాయి. వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులు చర్చాగోష్ఠుల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మూసీ పునరుజ్జీవనం, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవృద్ధికి రాష్ట్రం ఎదగడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక.. తదితర అంశాలపై చర్చించారు.
ఉదయం 10 నుంచి 11.30 గంటల దాకా మొదటి హాల్‌లో జినోమ్ వ్యాలీ అండ్ బియాండ్-యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్‌సైన్సెస్‌పై సెషన్ నడిచింది. రెండో హాలులో తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌పై, హాల్ నెంబర్ త్రీలో తెలంగాణ అనుభవాలు-వారసత్వం, సంస్కృతి, ఫ్యూచర్ రెడీ టూరిజంపై.. 4వ నెంబర్ హాల్‌లో 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా మూలధనం పెంపు, ఉత్పాదకతపై చర్చ నడిచింది.
11.45 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలదాకా హాల్ నెంబర్ వన్‌లో ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్‌పై.. రెండో హాలులో మూసీ పునరుజ్జీవం, బ్లూ, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్‌పై సెషన్స్ కొనసాగాయి. హాల్‌నెంబర్ త్రీలో పట్టణ, గ్రామీణ అనుసంధానం కోసం కనెక్టడ్ తెలంగాణ అంశంపై చర్చించారు.
మధ్యాహ్నం 2.15 నుంచి 3గంటల 45 నిమిషాల దాకా మొదటి హాల్‌లో భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ డాలర్స్‌పై సెషన్ నిర్వహించారు. బిల్డింగ్ తెలంగాణ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టం-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0పై రెండో హాలులో చర్చ జరిగింది. హాల్ నెంబర్ త్రీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఫోర్త్ హాల్‌లో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడులపై సెమినార్లు నిర్వహించారు.
సాయంత్రం 4గంటల నుంచి ఐదున్నర గంటలదాకా మొదటి హాల్‌లో సృజనాత్మక శతాబ్దం-ఇండియాస్ సాఫ్ట్ పవర్, వినోదరంగం భవిష్యత్తుపై సెషన్‌కు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. హాల్‌నెంబర్ రెండులో ప్రతి ఒక్కరికీ అవకాశాల కల్పనకోసం ఇన్‌క్లూజివ్ ప్రాస్పరిటీ.. మూడో నెంబర్ హాలులో పెట్టుబడి, అభివృద్ధి మార్గాలు.. ఆర్థిక హబ్‌పై.. ఫోర్త్ హాలులో స్టార్టప్స్ ఏర్పాటుకున్న అవకాశాలపై చర్చించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు ఈజ్ ఆఫ్ అట్రాక్టింగ్ టాలెంట్‌పై కూడా డాక్యుమెంట్‌లో దృష్టిసారించారు. మేథస్సును ఆకర్షించే తొలి రాష్ట్రంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండ్రోజుల గ్లోబల్ సమ్మిట్ దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలనుంచి 5లక్షలకోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. తొలిరోజు 35పైగా ఎంవోయూలతో 3లక్షల 97వేల 500 కోట్ల పెట్టుబడులు వస్తే.. రెండోరోజు లక్షా 4వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగటంతో సమ్మిట్ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరింది.
ప్రపంచపటంలో తెలంగాణని అగ్రభాగాన ఉంచే లక్ష్యంతో నిర్వహించిన రెండ్రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో క్లైమాక్స్ సీన్ డ్రోన్ షో. ఒకేసారి 3 వేల డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్.. కమ్, జాయిన్ ది రైజ్ అక్షరాల సమాహారం సమ్మిట్‌కే హైలైట్‌గా నిలిచింది.
