AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 NRI Conclave: తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి.. టీవీ9లో NRI పొలిటికల్ కాంక్లేవ్.. పూర్తి వివరాలు

యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అటు విదేశాల్లోని ఎన్నారైలలో కూడా తెలంగాణ దంగల్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంటోంది. ఉన్నత చదువులు, ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్న వారిలో కొందరు.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఆసక్తితో తెలంగాణలోని తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అందుకే ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నట్లు వారు చెబుతున్నారు.

TV9 NRI Conclave: తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి.. టీవీ9లో NRI పొలిటికల్ కాంక్లేవ్.. పూర్తి వివరాలు
Tv9 Usa Conclave
Janardhan Veluru
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 25, 2023 | 7:35 PM

Share

యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అటు విదేశాల్లోని ఎన్నారైలలో కూడా తెలంగాణ దంగల్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంటోంది. ఉన్నత చదువులు, ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్న వారిలో కొందరు.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఆసక్తితో తెలంగాణలోని తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అందుకే ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నట్లు వారు చెబుతున్నారు.

ఓ రకంగా ప్రవాస తెలంగాణవారు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, దుబాయ్ ఇలా ఏ దేశంలో ఉన్నా ఇప్పుడు వారి మనసు తెలంగాణ దంగల్‌పైనే నెలకొంటోంది. విదేశాల్లో ఉంటూనే తమతమ నియోజకవర్గాల్లో ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతున్నారు. ఎవరు మన ఎమ్మెల్యే అయితే మంచి జరుగుతుందో తమ సన్నిహితులు, స్నేహితులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు విదేశాల్లో ఉంటూనే తమ గ్రామం, తమ ప్రాంతం వారిని ఎన్నికలపై చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకే ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులు.. ఎక్కువ ఓట్లను ప్రభావితం చేయగల ఎన్నారైలను కూడా ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా టీవీ9 ఎన్నారైల కోసం ఓ ప్రత్యేక పొలిటికల్ కాంక్లేవ్ నిర్వహించనుంది. టీవీ9 తెలుగు ఛానల్‌‌ లైవ్‌లో ఎన్నారై స్పెషల్ కాంక్లేవ్ 2023ను నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున 2.30 గం.ల నుంచి 5.30 గం.ల వరకు మూడు గంటల పాటు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. అంటే ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గం.లకు, దుబాయ్ కాలమానం మేరకు ఆదివారం రాత్రి 1 గం.కు ఇది టీవీ9లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే న్యూయార్క్ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గం.లకు, కాలిఫోర్నియా కాలమానం మేరకు మధ్యాహ్నం 1 గం.కు, టెక్సాస్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గం.లకు దీని ప్రసారం ఉంటుంది. అటు లండన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

తెలంగాణ ఎన్నికల నుంచి ప్రవాస భారతీయులు కోరుకుంటున్నది ఏంటి? ఉచిత హామీలపై వారి మనోగతం ఏంటి? ఓటర్లు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని తీర్పు ఇవ్వాలి? ఎవరు మన పాలకులైతే మంచిది? తెలంగాణపై వారి విజన్ ఏంటి? తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తున్న పార్టీల నుంచి ఎన్నారైలు ఆశిస్తున్నది ఏంటి? తదితర అంశాలపై వీక్షకులు ఈ కాంక్లేవ్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేయొచ్చు. టీవీ9 సత్య, సుకుమార్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తారు. ఈ కాంక్లేవ్‌‌లో వర్చువల్‌గా పాల్గొనేందుకు మీరు చేయాల్సిందల్లా.. పైన ఇచ్చిన టైమ్‌లో వాట్సప్ ద్వారా నెంబర్ 8006036036కు వీడియో కాల్ చేయాలి.