AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: పార్టీల్లో చిచ్చు పెడుతున్న టికెట్ల పంపకాలు.. కన్నీటితో వీడ్కోలు పలుకుతున్న నేతలు

వరుస రాజీనామాలతో పార్టీలకు జలక్ ఇస్తున్నారు. కీలక నేతలు పార్టీలకు గుడ్ బై చెప్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సమీకరణలో ఒక్కసారిగా మారిపోతున్నాయి. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు దూతలను రంగంలోకి దింపిన పరిస్థితిలో ఏ మార్పు కనిపించడం లేదు

Telangana Elections: పార్టీల్లో చిచ్చు పెడుతున్న టికెట్ల పంపకాలు.. కన్నీటితో వీడ్కోలు పలుకుతున్న నేతలు
Brs, Bjp, Congress Party
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Oct 25, 2023 | 12:17 PM

ఈ పార్టీ.. ఆ పార్టీ అన్న తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ అదే టెన్షన్. టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలంతా అడియాసలు అవడంతో అదిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ నేతల తీరుపై ఆగ్రహావేశాలతో కోపంతో ఊగిపోతున్నారు. ఇంతకాలం పడ్డ శ్రమంతా వృధా అవుతుందని కన్నీళ్ల దారలతో పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. నమ్ముకున్న పార్టీలు నట్టెట్ట ముంచడంతో వరుస రాజీనామాలతో పార్టీలకు జలక్ ఇస్తున్నారు. కీలక నేతలు పార్టీలకు గుడ్ బై చెప్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సమీకరణలో ఒక్కసారిగా మారిపోతున్నాయి. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు దూతలను రంగంలోకి దింపిన పరిస్థితిలో ఏ మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో రాజీనామాలతో శరవేగంగా మారుతున్న రాజకీయాలపై ప్రతేక కథనం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పదికి పది నియోజకవర్గాల్లో ఇప్పుడు రాజీనామాల జాతర నడుస్తోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేదు.. ఈ నేత.. ఆనేత అన్న భేదబావం లేదు. అందరిది ఒకే దారి.. సముచిత స్థానం దక్కలేదని.. పార్టీకోసం చమటోడిస్తే నమ్మించి నట్టెట్ట ముంచారన్న ఆగ్రహమే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ లిస్టులో బీఆర్ఎస్ ముందజలో దూసుకుపోతుంది. టికెట్లు దక్కకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు గులాభీ పార్టీకి గుడ్ బై చెప్పగా.. అదే బాటలో ద్వితియ శ్రేణి నాయకత్వం సైతం మీ వెంటే మేమంటూ రాజీనామాలతో కారుకు వరుస షాకులిస్తోన్నారు. ఈ క్రమంలోనే ముధోల్ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తీరు నచ్చక, ఏకంగా 1000 మందికి పైగా కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో అక్కడ పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది.

కమలం పార్టీలో కలవరం..

అయితే ఇదే సమయంలో కమలం పార్టీలోను రాజీనామాల రాజకీయం జోరందుకుంది. టికెట్ దక్కలేదన్న ఆగ్రహంతో భంగపడ్డ ఆశావాహులంతా భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయం తీసుకోవడం.. ఆయా నియోజక వర్గాల్లో కమలంకు బిగ్ షాక్ గా మారుతోంది. ఇప్పటికే నిర్మల్ జిల్లా బీజేపీ అద్యక్షురాలు పడకంటి రమాదేవి ముధోల్ టికెట్ దక్కకపోవడంతో.. కన్నీటి పర్యంతమవుతూ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. అధికారికంగా రాజీనామా లేఖను పార్టీకి అందించ కపోయినా త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానంటూ పేర్కొన్నారు.

తాజాగా రమాదేవి బాటలోనే ఇదే జిల్లాకు చెందిన మరో మహిళా నేత పెంబి జెడ్పీటీసీ.. ఖానాపూర్ నియోజక వర్గ నాయకురాలు జానుబాయి పార్టీకి రాజీనామా చేశారు. ఖానాపూర్ టికెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు మహిళా నేతలు. బీజీపీలో మహిళలకు పెద్ద పీట చేస్తాంరటూ ఆశలు కల్పించిన బీజేపీ అదిష్టానం.. బలమైన నాయకురాళ్లను విస్మరించిందని మండిపడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు నియోజక వర్గాల్లో మహిళ నేతలు బలంగా ఉంటే.. ఒక్కరంటే ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అగౌరవ పరుస్తూ మగ మహారాజులకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపించారు జానుభాయి.

అటు ఆదిలాబాద్ కీలక నేత సీనియర్ బీజేపీ నాయకురాలు సుహసిని రెడ్డి సైతం త్వరలోనే బీజేపీని వీడబోతున్నారనే చర్చ జోరందుకుంది. ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీ టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న సుహసిని రెడ్డికి అధిష్టానం జలక్ ఇవ్వడంతో తన సత్తా ఏంటో బీజేపీ అదిష్టానానికి చూయించేందుకు సిద్దమైనట్టు సమాచారం.

కమలం, కారు పార్టీలలోనే కాదు కాంగ్రెస్‌లోనూ అదే సీన్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు‌ కేవలం మూడే నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటించింది కాంగ్రెస్. హోరాహోరీ టికెట్ పోటీ ఉన్న మరో ఏడు నియోజక వర్గాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. అయితే ఆ తర్వాత హస్తంలో రాజీనామాల పర్వం తారా స్థాయిలో ఉంటుందనే చర్చ సాగుతోంది. అసలే అతి స్వేచ్చ ఉన్న పార్టీ కావడంతో కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ తేలాక అసమ్మతి నేతలు జంపింగ్‌లో ఏ స్థాయిలో ఉంటాయో అన్న చర్చ జోరందుకుంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ లో జోరుగా సాగుతున్న గోపిల రాజకీయం అదేనండి గోడ మీద పిల్లుల పాలిటిక్స్.. ఎవరిని రాజును చేస్తుందో ఏ నాయకుడి కొంప ముంచుతుందో.. ఎవరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతోందో చూడాలి..! ఇప్పటికైతే యదా టికెట్ తథా రాజీనామా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ రాజీనామాల పర్వం ఎవరి ఆశలకు గండికొడుతుందో.. ఎవరి సీటుకు నామాలు పెడుతుందో మరీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…