Hyderabad: తగ్గేదేలే.. అంటూ పుష్ప సినిమాను మించిన సీన్.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
తగ్గేదేలే.. పుష్ప సినిమా ట్రెండ్ గురించి మనం చెప్పాల్సిన పనేలేదు.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్.. ముఖ్యంగా గంధపు చెక్క అక్రమ రావాణా కథాంశంగా తీసిన ఈ సినిమా.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది..

తగ్గేదేలే.. పుష్ప సినిమా ట్రెండ్ గురించి మనం చెప్పాల్సిన పనేలేదు.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్.. ముఖ్యంగా గంధపు చెక్క అక్రమ రావాణా కథాంశంగా తీసిన ఈ సినిమా.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది.. త్వరలోనే పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే, పుష్ప సినిమా తర్వాత.. అక్రమ రవాణా ఎలా జరుగుతుంది..? ఇలాంటి స్టైల్లో కూడా రవాణా చేస్తారా..? అనే కొత్త విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే.. అదే తరహాలో డబ్బు, గంజాయ్, బంగారం, డ్రగ్స్.. ఇలా ఎన్నో విలువైన వస్తువులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే.. తాజాగా.. పుష్ప సినిమా స్టైల్లో అక్రమంగా గంజాయ్ తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి దూలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలతో గంజాయి ముఠా ఆపరేషన్ బయటపడింది. కారు నెంబర్ AP 36 R 3033కి పుష్ప సినిమా తరహాలో ప్రత్యేకంగా సీటు అమర్చి గంజాయి సప్లై చేస్తున్న ముఠా పట్టుబడింది. కారు వెనుక భాగంలో డిఫరెంట్ సెటప్ ఏర్పాటు చేశారు నిందితులు. కారు ఆపి తనిఖీ చేయగా 41 ప్యాకెట్‌లు, 82 రెండు కిలోల గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యుల బాగోతం బయటపడింది.
వీడియో చూడండి..
సుచిత్ర సెంటర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారును దూలపల్లిలో నిలిపి తనిఖీలు చేశారు పోలీసులు. నిందితుల నుంచి కారు, రెండు సెల్ ఫోన్లు, 41 ప్యాకెట్‌లలో అమర్చిన 82 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అమర్నాథ్, సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులను లోతైన సమాచారం రాబడుతున్నారు పేట్ బషీర్‌బాద్ పోలీసులు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరి ఆపరేషన్ ఎలా సాగుతుందనే కోణంలో కూపీ లాగుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..